Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రియల్ కేరళ స్టోరీ నివ్వెరపోయే నిజాలు - Facts behind Kerala Story - vandebharat

రియల్ కేరళ స్టోరీ... నివ్వెరపోయే నిజాలు: అఖిలా అశోకన్ కోయంబత్తూరులో హోమియో వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో ఇస్లాం మతం లోకి మారిపోయింది. హ...


రియల్ కేరళ స్టోరీ... నివ్వెరపోయే నిజాలు: అఖిలా అశోకన్ కోయంబత్తూరులో హోమియో వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో ఇస్లాం మతం లోకి మారిపోయింది. హదియా జహాన్ గా మారింది. ఆ తర్వాత షఫిన్ జహాన్ అనే ముస్లిం వ్యక్తిని కలుసుకుని ఇరవై ఐదేళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. అఖిల తండ్రి అశోకన్ రిటైర్డ్ ఆర్మీ డ్రైవర్. సీపీఐ సానుభూతి పరుడు. ఈ వివాహ విషయం తెలిసి అశోకన్ తన అమ్మాయిని తనకి ఇప్పించమని కేరళ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. హదియాను తప్పుదోవ పట్టించి బలవంతంగా ముస్లింగా మార్చారని, అఖిల భర్తకు తీవ్రవాద ముస్లిం సంస్థలతో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. కానీ.... తాను ఇస్లాంలోకి మారడంతోపాటు షఫిన్ జహాన్ ‌తో పెళ్లి కూడా తన ఇష్టపూర్వకంగానే జరిగిందని హదియా హైకోర్టుకు చెప్పింది.

అయితే, మే 24, 2017న, హైకోర్టు న్యాయమూర్తులు సురేంద్ర మోహన్, కురియాకోస్, అబ్రహం మాథ్యూలు ఈ వివాహాన్ని ‘బూటకం’ అని పేర్కొంటూ, పెళ్లి చేసుకున్న వారిద్దరూ మేజర్లే అయినప్పటికీ, 'హదియా వివాహం అనేది ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయమని, ఆమె తల్లిదండ్రుల ప్రమేయంతో మాత్రమే ఆ నిర్ణయం తీసుకోబడాలని చెప్పి, వివాహం రద్దు చేసి హదియాని ఆమె తండ్రి అశోకన్ కస్టడీకి అప్పజెబుతూ తీర్పు చెప్పారు. హదియా భర్త తన వివాహ రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 8, 2018న, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కేరళ హై కోర్ట్ తీర్పు ని రద్దును చేసి హదియా, తన భర్తతో ఉండొచ్చని తీర్పు చెప్పింది.

ఈ కేసు అప్పట్లో అటు కేరళలోనూ, ఇటు దేశ వ్యాప్తంగానూ సంచలన వార్త అయింది. మీడియాలో బోలెడు కథనాలు వచ్చాయి. 'సత్య సరణి' అనేది PFI అనుబంధ సంస్థ. దీనికి హెడ్ జైనాబ్ ఖాన్ అనే ఆమె. ఈమె ముస్లిం పెర్సొనల్ లా బోర్డ్ మెంబర్ కూడా. ఈమే పైన చెప్పుకున్న హదియా మత మార్పిడి, పెళ్లి వెనుక ఉంది అనేది అశోకన్ ఆరోపణ. మా సంస్థ గత 10 సం. లలో 5000మంది హిందూ మరియు క్రిస్టియన్ స్త్రీలను మత మార్పిడి చేశాం అని ఈమె ఇండియా టుడే 2017లో నిర్వహించిన ఒక స్టింగ్ ఆపరేషన్ లో కెమెరా ముందు చెప్పింది. ఇవే కాదు చాలా సీక్రెట్స్ బయట పెట్టింది. జైనాబా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్. ఇండియా టుడే నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో జైనబా కేరళలో, PFI, దాని అనుబంధ సంస్థ సత్యసరణిలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మతమార్పిడుల వివరాలను వెల్లడించింది.

"గత పదేళ్లలో మా సంస్థ తరపున మేం 5000 మందిని ఇస్లాంలోకి మార్చాం. ఆ విధంగా మతం మారిన వారిలో హిందువులు, క్రైస్తవులు ఇరువురూ ఉన్నారు." అని ఆమె వెల్లడించింది. నిజానికి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ లలో ఆయా ప్రభుత్వాలు మతమార్పిడులను నిషేధించాయి. కానీ కమ్యూనిస్టుల పాలనలోని కేరళలో మతమార్పిడులకు తలుపులు తెరిచి పెట్టడంతో.... అక్కడ ఇప్పుడు అదొక పెద్ద సామాజిక సమస్యగా పరిణమించింది.

కేరళ మలప్పురంలోని తమ స్వగృహంలో జైనాబా, ఆమె భర్త అలీ ఇండియా టుడే రహస్య ప్రతినిధితో మాట్లాడుతూ.... తాము ఇన్నేళ్లలో ముస్లిమేతర మహిళలను ఏ విధంగా మతం మార్చిందీ స్పష్టంగా వివరించారు. " మాతో ఒక స్కూల్ టీచర్ ఉంది. ఆమె మ్యాథమెటిక్స్ లో ఎమ్మెస్సీ చేసి, బీఈడీ కూడా పూర్తి చేసింది. ఇంతకుముందు ఆమె పేరు శుభ. నాలుగేళ్ల క్రితం ఆమె ఫాతిమాగా మారింది." అని చెప్పాడు అలీ. "ఈ విధంగా మీ చేత మతం మార్చబడ్డవాళ్ళు ఎంతమంది ఉంటారు?" అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు " ఓ.... చాలామందే ఉన్నారు." అని బదులిచ్చింది జైనాబా. తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా తాము సేవా సంస్థలు, విద్యాసంస్థల ముసుగులో మత మార్పిడి కార్యకలాపాలను సాగిస్తామని జైనాబా ఈ సందర్భంగా వెల్లడించింది.

"మేము అది మత మార్పిడి కేంద్రమని అధికారికంగా చెప్పం కదా? పైకి చూట్టానికది అది ఒక విద్యా సంస్థగానో, సేవా సంస్థగానో ఉంటుంది. దానికి చాలా ముందస్తు తయారీ అవసరం. అందుకు చాలా వనరులు కావాలి. ముందుగా మేము ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలి. ట్రస్ట్ రిజిస్టర్ కావాలంటే ఒక్కొక్క ట్రస్ట్ లో కనీసం 15 మంది సభ్యులుండాలి. ఆ ట్రస్ట్ భవనాన్ని నిర్మించడానికి ఓ స్థలం కావాలి. అందులో నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఓ మసీదు, వసతి సౌకర్యాలు. సత్యసరణిలాగా, అత్యాధునిక సౌకర్యాలు, ఫర్నిచర్ ఉన్న ఓ ఆఫీసు వంటి ఏర్పాట్లన్నీ ఉండాలి. అనంతరం సొసైటీల నమోదు చట్టం క్రింద మేము ఒక సొసైటీని ఫార్మ్ చేసి, దానికి ప్రభుత్వ అనుమతులు పొందాలి.” అని వెల్లడించింది జైనాబా. అనంతరం మతం మారిన వారి సర్టిఫికేట్లను తాము ఎలా మార్పిడి చేయిస్తామో కూడా జైనాబా వివరించింది. " దానికి రెండు మార్గాలున్నాయి. ఆ వ్యక్తి ఇస్లాంను స్వీకరించినట్టుగా కొన్ని సంస్థల నుంచి సర్టిఫికెట్ పొందడం, లేకపోతే నోటరీ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం." అని చెప్పింది జైనాబా. PFI కి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయని, హవాలా మార్గాలలో నిధులు పొందుతోందని NIA కూడా నిర్ధారించింది.

ఇండియా టుడే... తమ రహస్య ఆపరేషన్ లో భాగంగా న్యూఢిల్లీలోని PFI వ్యవస్థాపక సభ్యుడు ఒకరిని కలుసుకున్నప్పుడు, ఇస్లామిక్ రాజ్య స్థాపనకు తాము కట్టుబడి ఉన్నట్టు అతను పేర్కొన్నాడు. PFI వ్యవస్థాపక సభ్యుడు, దాని అనుబంధ పత్రిక గల్ఫ్ తేజస్ మేనేజింగ్ ఎడిటర్ అయిన అహ్మద్ షరీఫ్, తమకు అక్రమ మార్గాలలో నిధులు అందుతున్నాయన్న సంగతిని స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడించాడు. ప్రపంచమంతటా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే తమ లక్ష్యమని అహ్మద్ షరీఫ్ స్పష్టం చేశాడు. " ఒక్క భారత్ లోనే కాదు. భారత్ ను ఇస్లామిక్ రాజ్యాంగా మార్చిన తర్వాత, మేం మొత్తం ప్రపంచాన్ని కూడా ఇస్లాం మయం చేసి తీరుతాం." అని షరీఫ్ వెల్లడించాడు. తాము మిడిల్ ఈస్ట్ నుంచి హవాలా మార్గాల ద్వారా PFI కోసం ఏ విధంగా నిధులు సేకరించింది కూడా షరీఫ్ వివరించాడు.

అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ హదియా కేసు, షఫీన్ తరుపున వాదించింది కాంగ్రెస్ నేత కపిల్ సిబల్, అలాగే మరో సెలబ్రిటీ లాయర్ ఇందిరా జైసింగ్. ఇద్దరూ కేసులు వాదించడానికి లక్షల్లో ఫీజులు వసూలు చేసే వారే. మరి మధ్య తరగతికి చెందిన షఫీన్ అంత ఖరీదయిన లాయర్ల ను ఎలా పెట్టుకున్నాడు? తరువాత బయట పడిన విషయం ఏమిటంటే PFI సంస్థ మీద మనీ లాండరింగ్ కేసులో ED దాడులు చేస్తే బాంక్ స్టేట్మెంట్స్ లో ఈ హదియా కేసు కోసం కపిల్ సిబల్ కి PFI, ₹77 లక్షలు చెల్లించింది అని బయట పడింది. అబ్బే... నేను తీసుకోలేదు అని ముందు ఖండించిన సిబల్, ఈడీ బాంక్ స్టేట్మెంట్స్ బయట పెట్టిన తరువాత ఒప్పుకున్నాడు.

ఆఫ్టర్ అల్ ఒక మధ్య తరగతి మతాంతర లవ్ మేరేజీ గొడవ రెండు కుటుంబాల సమస్య. ఏ అజెండా లేకపోతే దీనిలో PFI కి ఏంటి ఇంటరెస్ట్? సిబల్ కే ₹77లక్షలు ఇచ్చారంటే ఇందిరా జైసింగ్ కి కూడా పెద్ద మొత్తమే ఇచ్చి ఉండవచ్చు. అంటే ఒక లవ్ మేరేజీ కోర్ట్ కేసు మీద కనీసం కోటి రూపాయలు ఖర్చు చేశారు ఎందుకు? బహుశా మతం మరిపోదాం అనుకునే మిగతా మేజర్ హిందూ క్రిస్టియన్ ఆడపిల్లలకు, మతం మారి వివాహం చేసుకున్నా కేసులు గురించి మేం చూసుకుంటాం అనే భరోసా కలిగించడానికా? ఏమో ? దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే గానీ తెలియదు.

హదియా తండ్రి అశోకన్ 'కేరళ స్టొరీ' చూసి మీడియాతో మాట్లాడుతూ... “సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చిన కొద్ది కాలానికే షఫీన్ తన కూతురు హదియాని వదిలేశాడు. 2018 తరువాత అతను నాకు కనిపించలేదు. హదియా ప్రస్తుతం జైనాబా దగ్గర ఉంటోంది.” అని చెప్పాడు. ఎప్పుడు హదియాను చూడడానికి వెళ్లినా చుట్టూ నలుగురైదుగురు వుంటారు. నా కూతురితో నేను ప్రైవేట్ గా మాట్లాడే అవకాశమే రావడం లేదు.” అని చెప్పాడు అశోకన్. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుతున్నాను ఎందుకో భయపడుతూ ఉంటుంది, ఇంటికి రమ్మంటే రానంటుంది.” అని చెప్పాడు. కేరళ స్టొరీ వంటి సినిమాలు ప్రజల్లో చైతన్యం తెస్తాయి అన్నాడు హదియా తండ్రి అశోకన్. ‘కేరళ స్టోరీ’ కట్టుకథ అని వక్కానించేవాళ్ళు ఇప్పుడేమంటారు? చూద్దాం. జైహింద్. - శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి. 

Narada News Telugu... Subscribe for more Videos