Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ISIS కార్యకలాపాలు - మతం మారిన హిందువుల పాత్ర

    ISIS కార్యకలాపాలు - మతం మారిన హిందువుల పాత్ర : ‘ద కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేరళ స్టోరీ...

 

 ISIS కార్యకలాపాలు - మతం మారిన హిందువుల పాత్ర: ‘ద కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేరళ స్టోరీ సినిమా కేవలం లవ్ జిహాద్ అంశాన్ని మాత్రమే వెలుగులోకి తేలేదు. బాధిత మహిళలను ఐసిస్ క్యాంపులకు ఎలా తరలిస్తారు? భారత్ లో, కేరళ ఏ విధంగా ఐసిస్ ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ సెంటర్ గా మారిందనే విషయాన్ని కూడా కేరళ స్టోరీ వివరిస్తుంది. NIA, కేరళలో ఛేదించిన ఐసిస్ మాడ్యూల్ ని నిశితంగా పరిశీలిస్తే కేరళలో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారానికి, భారత్ లోని ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకి ఉన్న లింకులు కూడా మనకు అర్థం అవుతాయి. దానిని గనక పరిశీలిస్తే... జిహాద్, ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క మూలాలు ఎంత లోతుగా వ్యాప్తి చెందున్నాయో, రాష్ట్రాలను, దేశాలనూ దాటుకుని ఆ ఉగ్ర మూలాలు ఎంతగా విస్తరించి ఉన్నాయో, ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇస్లామిస్టుల దేశాలు వేరు కావచ్చు. కానీ వారి ఉద్దేశాలు మాత్రం ఒకటే. వారి లక్ష్యం ఒకటే. వారి జిహాదీ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఒకటే.

బీహార్ కి చెందిన యాస్మిన్ అహ్మద్ జాహిద్ అనే యువతి వృత్తాంతాన్ని ఓసారి తెలుసుకుందాం. బీహార్, సీతా మర్హి లోని మురవుల్ గ్రామానికి చెందిన యాస్మిన్ అహ్మద్ జాహిద్, సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సౌదీ అరేబియాలో నివాసం ఉంది. 2011లో, ఆ జంట కేరళకు వచ్చారు. కేరళలో ఇస్లామిక్ మతమార్పిడులకు అడ్డాగా ఉండే మలప్పురంలో మకాం వేసింది యాస్మిన్ అహ్మద్ జాహిద్. ములప్పురంలోని "పీస్ సెంటర్ నేషనల్ స్కూల్" లో ఇంగ్లీష్ టీచర్ గా జాయినయింది. పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి భారతదేశ వ్యాప్తంగా 12 శాఖలున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా ఆ పాఠశాల బ్రాంచ్ ఉంది. 2016 జూలై 1న ఢాకాలో జరిగిన ఒక బాంబు పేలుడు ఘటనలో ఆ స్కూలు సిబ్బందికి సంబంధం ఉందనే అనుమానంపై ఆ స్కూల్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం సీజ్ చేసింది. నిజానికి ఈ పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి మూలం, ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్, ముంబైలోని మజ్గావ్ ప్రాంతంలో నడుపుతున్న ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూలే. 2006లో, ఎం ఎం అక్బర్ అనే అతను, నీచే గ్రూప్ నేతృత్వంలో, ఇస్లాం ప్రచారం కోసం పనిచేసే ఒక స్వతంత్ర సంస్థగా ఈ పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రారంభించాడు. ఈ స్కూల్ కి కేరళలో 10 ఫ్రాంచైజీలున్నాయి. అలాగే... కర్ణాటకలో ఒకటి, తమిళనాడులో ఒకటి ఉంది. ఇందులో 12వ తరగతి వరకు విద్యా బోధన జరుగుతుంది. 2016 నాటికి ఈ అన్ని స్కూల్స్ లో కలిపి దాదాపుగా 7000 మందికి పైగా విద్యార్థులున్నారని అంచనా.

2016, మే మూడో తేదీన యాస్మిన్ అహ్మద్ జాహిద్, అబ్దుల్ రషీద్ అబ్దుల్లా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కేవలం, ఒక ఫోన్ కాల్ లో ఈ వివాహం జరిగిపోయింది. ఈ అబ్దుల్ రషీద్ అబ్దుల్లా సోనియా సెబాస్టియన్ అనే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కి వలవేసి, ఆమెను ఇస్లాంలోకి, ఆయేషాగా మార్చి వివాహం చేసుకున్నాడు. ఈ జంట కేరళలో ఇస్లామిక్ జిహాదీ తరగతులు నిర్వహించేవారు. యాస్మిన్ అహ్మద్ జాహిద్, ఈ తరగతులకు తాను హాజరు కావడమే కాకుండా, ఇతర విద్యార్థులను కూడా అక్కడికి తీసుకొచ్చి, వారిని ఐసిస్ ఉగ్రవాదులుగా మార్చడానికి కృషి చేస్తుండేది.

2016లో, యాస్మిన్ అహ్మద్ జాహిద్ ని ఎన్ఐఏ అధికారులు ఇంటరాగేట్ చేసినప్పుడు, తాను కేరళకు చెందిన 22 మందిని ఐసిస్ లో జాయిన్ చేశానని, వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించింది. ఐసిస్ నియంత్రణలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్లు ఎక్కడున్నారో కనుక్కోవడం కష్టం. ఆ సమయంలో కేరళకు చెందిన 40 మందికి అబ్దుల్ రషీద్ బ్రెయిన్ వాష్ చేశాడని యాస్మిన్ వెల్లడించింది. అబ్దుల్ రషీద్, అతని భార్య ఆయేషా నిర్వహించే మతపరమైన బోధనలకు తాను ఆకర్షితురాలిని అయ్యానని, అక్కడ వారు తమకు హిజ్ర్, జిహాద్, ఐసిస్ ల గురించి బోధించే వారని యాస్మిన్ వెల్లడించింది.

ఇక్కడ ఆమె మతం మార్చిన వారిని ఆఫ్ఘనిస్తాన్ కు తరలించడానికి, ఫ్లైట్ టికెట్లకు అబ్దుల్ డబ్బు పంపించేవాడు. ఒక్క కాసర్గోడ్ జిల్లాలోనే యాస్మిన్ ఒక్కటే, 15 మందిని ఐసిస్ లో చేర్చింది. మొదట్లో కేరళ పోలీసులు వాటిని మిస్సింగ్ కేసులుగా భావించారు. NIA దర్యాప్తు తర్వాతనే నిజా నిజాలు వెలడయ్యాయి. తాము మతం మార్చి ఐసిస్ లో జాయిన్ చేసిన వారిని బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఎయిర్పోర్ట్ ల ద్వారా కువైట్, దుబాయ్, మస్కట్, అబుదబిలకు చేర్చి, అక్కడ్నుంచి ఇరాన్ గుండా వారిని ఆఫ్ఘనిస్తాన్ తరలించామని విచారణ సందర్భంగా యాస్మిన్ అహ్మద్ జాహిద్ వెల్లడించింది. 2016లో కేరళ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు పంపిన 21 మంది భారతీయులలో ఈ 15 మంది కూడా ఉన్నారు. అబ్దుల్ రషీద్ అబ్దుల్లా, అతని భార్య సోనియా సెబాస్టియన్ అలియాస్ ఆయేషా కూడా ఇలా వెళ్ళిన బృందంలో ఉన్నారు. ఈ గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్ చేరిన వారిలో నలుగురు మహిళలు, అక్కడ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి లొంగిపోయారు. అనంతరం భారత్ లోకి రావడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కానీ వారికి ఐసిస్ తో ఉన్న లింకుల కారణంగా వారికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

అబ్దుల్ రషీద్ యాస్మిన్ కు టెలిగ్రామ్ ద్వారా కాల్ చేసేవాడు. ఐసిస్ నాయకుడు అబూబకర్ అల్ బాగ్దాది నేతృత్వంలో ఇస్లామిక్ సామ్రాజ్యం స్థాపించాలనేది వీళ్ళ లక్ష్యం.2016 జూలైలో, తాము ఇక్కడి నుంచి పంపిన వాళ్లు ఆఫ్ఘనిస్తాన్ లోని ఐసిస్ ఉగ్రవాద కేంద్రానికి చేరుకున్నారని రషీద్ యాస్మిన్ కి చెప్పాడు. తన భార్య ఆయేషా పేరిట ఉన్న అకౌంట్ కు చెందిన ఏటీఎం కార్డును రషీద్, యాస్మిన్ కి ఇచ్చాడు. 2016 జూలైలో ఆమెకు ఒకటిన్నర లక్షల రూపాయలను పంపాడు. వీళ్లు ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు పంపిన వారిలో కొందరు ISIS ఉగ్రవాద సంస్థ కోసం జరిపిన పోరాటంలో మరణించారు కూడా.

తన బిడ్డతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న యాస్మిన్ అహ్మద్ జాహిద్ ను 2016, జులై 30వ తారీఖున ఢిల్లీ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. 2018 మార్చి 24న ఆమెకు కొచ్చిలోని NIA కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళ - ఐసిస్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా, మరిన్ని ఆధారాల సేకరణకు గానూ 2021 ఆగస్టు 4న, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళలలోని ఒక ఐదు ప్రాంతాలలో దాడులు నిర్వహించింది. ఆ దాడుల సందర్భంగా, NIA, శ్రీనగర్లోని బెమినా నుంచి ఒబైద్ హమీద్ ను, కాశ్మీర్ లోని బందిపోరా నుంచి ముజమ్మిల్ హసన్ భట్ ను, కర్ణాటక మంగళూరు సమీపంలోని ఉల్లాల్ నుంచి అమర్ అబ్దుల్ రెహమాన్ ను, బెంగుళూరు నుంచి అలీ మౌవ్యగా పేరు మార్చుకున్న శంకర్ వెంకటేష్ పెరుమాళ్ లను అదుపులోకి తీసుకుంది. ఈ శంకర్ వెంకటేష్ పెరుమాళ్ అలియాస్ అలీ మౌవ్య స్టోరీ.... కేరళ స్టోరీ మేల్ వెర్షన్ అనుకోవచ్చు.

అదే విధమైన ఐసిస్ ఆనవాళ్ళను, నమూనాను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా NIA గుర్తించింది. ఉగ్రవాదులకు రాష్ట్రాలు, దేశాల హద్దులు లేవనే విషయాన్ని ఇది నిర్ధారిస్తోంది. వాళ్లందరి ఒకే ఒక లక్ష్యం జిహాద్. అదొక్కటే వారి మత ఉగ్రవాదానికి భూమిక. ఐసిస్ సభ్యులు ఎవరైనా సరే, వారికి పూర్వం ఒకరితో ఒకరికి పరిచయం లేకపోయినా సరే, వారు ఇప్పుడు ఒకరికొకరు ఆప్త మిత్రులయిపోతారు. ఆ భావజాలాన్ని నమ్మేవారు తప్ప, మిగిలిన వారెవరైనా సరే వారికి శత్రువులే.

జాతీయ సమగ్రత, శ్రేయస్సు పట్ల ఉన్న దృష్టి ఒకే నాగరికత కలిగిన వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఒకటిగా కలిసి ఆలోచించేలా, పనిచేసేలా చేస్తుంది. భారత్ లాంటి వివిధ సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు ఉన్న విశాల దేశంలోని ప్రజలు జాతి అభివృద్ధి కోసం సమైక్యంగా నిలుస్తారు. కానీ ఈ పాన్ ఇస్లామిజానికి, దేశ శ్రేయస్సు, అభివృద్ధి వంటివేవీ ప్రధానమైనవి కాదు. ప్రపంచవ్యాప్తంగా వారి మతపరమైన విశ్వాసాలు, సిద్ధాంతాలు, ప్రయోజనాల ఆధారంగా, దేశాలకు అతీతంగా వారందరూ ఒక్కటవుతుండడం ఇక్కడ విశేషం.

ఈ కారణంగానే కేరళలో ఐసిస్ అవలంభించిన విధానాలు దేశంలో మిగతా ప్రాంతాల ఇస్లామిస్టులను కూడా ఆకర్షించాయి. మతం కారణంగానే 2012లో మయన్మార్ లోని రోహింగ్యా ముస్లింలకు ఇబ్బంది వస్తే, ఇక్కడ మనదేశంలోని ఆజాద్ మైదాన్ లో, ముస్లింలు హింసాత్మక ప్రదర్శనలకు తెగబడ్డారు. మతం కారణంగానే, సల్మాన్ రష్దీకి విరుద్ధంగా ఇరాన్ ఇష్యూ చేసిన ఫత్వాను బేస్ చేసుకుని, అమెరికాలో ఒక ఇస్లామిస్టు అతనిపై దాడి చేశాడు. నిజానికి సల్మాన్ రష్దిపై ఇరాన్ ఫత్వా జారీ చేసిన సమయానికి ఆ యువకుడు పుట్టను కూడా లేదు. తాను పుట్టక ముందు ఎప్పుడో, ఇరాన్ సల్మాన్ రష్దిపై ఇష్యూ చేసిన ఫత్వా అతనిలో ఇప్పటికీ సల్మాన్ రష్దిపై ప్రతీకార వాంఛను రగిలించిందంటే ఆ మతవాదం ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు. సో.... పాన్ ఇస్లామిజానికి కాల అవధి కూడా లేదు. ఈ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అడ్డుకోవాలంటే, ప్రాంత, భాష, దేశ ఎల్లలు దాటి ప్రపంచమంతటా విస్తరించి ఉన్న దాని మూలాలను, అది విస్తరిస్తున్న తీరును, దాని కార్య ప్రణాళికను మనం ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేదో కేవలం ప్రభుత్వాలో, పోలీసులో, ఆర్మీ వర్గాలో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో మాత్రమే అర్థం చేసుకుంటే అంతమయ్యే విషయం కాదు. సాధారణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తమ చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆకళింపు చేసుకోవాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఆ ఉచ్చులో చిక్కుకోకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలి. భారత్ మాతాకీ జై. - శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి. 

Narada News Telugu... Subscribe for more Videos