Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఎవరు దేశ భక్తుడు? జార్జ్ రెడ్డా? జగన్మోహన్ రెడ్డా? - george reddy review

బ్లేడుతో రౌడీయిజం చేసిన ఒక రౌడీ గొప్పవాడా?? దేశగౌరవం కోసం ప్రాణాలర్పించిన విద్యార్థి గొప్పవాడా?? ఒక కాపీక్యాట్.. గడ్డంగీక్కునే బ్లేడుతో య...


బ్లేడుతో రౌడీయిజం చేసిన ఒక రౌడీ గొప్పవాడా??

దేశగౌరవం కోసం ప్రాణాలర్పించిన విద్యార్థి గొప్పవాడా??
ఒక కాపీక్యాట్.. గడ్డంగీక్కునే బ్లేడుతో యూనివర్సిటీ ని బేజారెత్తించిన జార్జి రెడ్డి ని అకస్మాత్తుగా ఎందుకు హీరోను చేస్తున్నారు??
జాతీయపతాక గౌరవం కాపాడడానికి తన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచిన జగన్ రెడ్డి ని ఎందుకు మర్చిపోతున్నారు??

 
మొదటి అంకం..
జార్జిరెడ్డి ఒక విపరీత భావాలున్న తెలివిగల దారితప్పిన కమ్యునిస్ట్ ప్రేరేపిత వ్యక్తి.. ( ఇతన్ని మాతృసంస్థ నిజానికి కాంగ్రేస్ పార్టీ అనుబంధ విధ్యార్ధి విబాగం NSUI కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఓన్ చేసుకుంది)..
అప్పట్లో షేవింగ్ బ్లేడును మారణాయుధంగా వాడి హింసా ప్రవృత్తి..శాడిస్ట్ మెంటాలిటీ..రాగింగ్ చేసే కుర్రాళ్ళకి ఆదర్శనాయకుడు..
ఇతని మీద అప్పట్లోనే 14 క్రిమినల్ కేసులున్నాయి హత్యకేసుతో సహా..
ఇతని ప్రధాన టార్గెట్ బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులే..కావాలంటే ఇతని గ్రూప్ ( పి.డి.యెస్.యు ) చేతిలో హత్యకు గురైన వ్యక్తుల సామాజిక నేపధ్యం చూడండి..
ఇతని వలన ఉస్మానియా యూనివర్సిటీలో హింసా ప్రవృత్తి తారాస్థాయికి చేరింది..నాటి ఉడుకురక్తపు కుర్రాళ్ళంతా ఇతని ప్రభావానికి లోనయ్యి అడవిబాటపట్టారు..జీవితాలు సర్వనాశనం అయ్యాయి..
ఎక్కడో ఉన్న చేగువేరాను ఇక్కడ ఇతను అనుకరించేవాడు..దుస్తులతో సహా!!
ఇతనికి అప్పట్లో కావలసింది ఆధిపత్యం..సాటి విద్యార్ధులమీద ఆధిపత్యం..లెక్చరర్లమీద ఆధిపత్యం..యూనివర్సిటీమీద ఆధిపత్యం..దానికోసం ఎంతకైనా తెగించేవాడు ..కొంతమంది అనుచరులను వేసుకొని జీపులో యూనివర్సిటీ కలియతిరుగుతూ బలహీనులమీద దాడులు చేసుకుంటూ విశ్వవిద్యాలయ వాతావరణంలో భయోత్పాతాన్ని సృష్టించేవాడు..
ఏమాత్రం ఎదురుతిరిగినా అర్ధరాత్రి హాస్టళ్ళమీద దాడులు చేసి ఎదురుతిరిగినోళ్ళని కొట్టుకుంటూ హస్టల్ చుట్టూతా పరుగెట్టించేవాడు..1970 ప్రాంతాల్లొ ఇతగాడు సృష్టించిన అరాచకానికి యునివర్సిటీ పాలకమండలి ఇతన్ని యూనివర్సిటీనుంచీ బహిష్కరించింది..
ఏబీవీపీ నాయకుడు నరసింహారెడ్డిని ఇతని గ్రూప్ కిడ్నాప్ చేసి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వేసి తీవ్రంగా కొట్టారు.. అలాగే మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావును..నారాయణదాసును తీవ్రంగా గాయపరిచాడు..నారాయణదాసును తీవ్రంగా కొట్టి అతను మరణించాడని వదిలిపెట్టి పబ్లిక్ గార్డెన్‌లో పడేసి తిరుగుముఖం పట్టారు..ఎంతో ఓపికగా భరించిన జాతీయవాద విద్యార్థులపై జార్జిరెడ్డి తన ముఠాతో తీవ్రంగా దాడులు చేయించాడు.. ఇంద్రసేనారెడ్డి..రవీందర్‌రెడ్డిల తలలు పగిలాయి తీవ్రంగా రక్తస్రావం అయ్యేంతవరకు చీఫ్ వార్డెన్ ఆఫీసులోనే దాడి చేశారు..
చివరకు నాటి న్యూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సి.సుదర్శన్ అత్యంత శీఘ్ర పైరవీ చేసి జార్జిరెడ్డి రస్టికేషన్‌ను రద్దు చేసేందుకు కృషిచేశాడు..ఈ సంఘటన తర్వాత ఇంకా రెచ్చిపోయి యూనివర్సిటీల్లోనే ' స్టూడెంట్ మాఫియా ' కు ఆధ్యుడైనాడు..
ఇక ఫిజిక్స్ టాపర్ ఎలా అయ్యాడో నాటి శాఖాధిపతిని అడిగితే చెప్పగలరు..బ్లేడు గొంతు మీద ఉంటే యూనివర్సిటీ టాపర్ ఏం కర్మ యూనివర్సల్ టాపర్ గా కూడా చేస్తారు..








రెండో అంకం..
సామా జగన్‌ మోహన్‌రెడ్డి. జాతీయ జెండా గౌరవం కోసం ఒక సైనికుడిలా విదేశీ భావజాలం గల ముష్కరులను ఎదిరించి..తన ప్రాణాన్ని కూడా లెక్కచేయని వ్యక్తి ఆయన..వరంగల్‌ జిల్లాలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జగన్‌మోహన్‌ రెడ్డి, వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో లా కోర్సు చేస్తూ సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న తరుణం అది. 1980లలో క్యాంపస్‌లలో విద్యార్ధులు ఆర్‌.యస్‌.యు., మావోయిస్టుల హింసలకు భయపడాల్సిన పరిస్థితులుండేవి. ఈ నేపథ్యంలో, జగన్‌మోహన్‌ తోటి విద్యార్ధులతో కలిసి, కె.యు.
ఏబీవీపీ అధ్యక్షుడిగా విద్యార్ధి సమస్యలపై ఉద్యమాలు చేసేవాడు. దేశంపట్ల, దేశభక్తి వంటి అంశాల్లోనూ తన ఆలోచనలను విద్యార్ధులతో చర్చిస్తూ విభిన్న కార్యక్రమాలు రూపొందించేవాడు.

1980 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీ, విద్యార్థుల సమక్షంలో వైస్‌ ఛాన్సలర్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. అంతలోనే, వారందరూ చూస్తుండగానే రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌.యస్‌.యు) మూకలు అక్కడికి చేరి ఎగురుతున్న ఆ మువ్వెన్నెల జెండాను కిందికి దించి దాని స్థానంలో నల్ల జెండాను ఎగరేసి బూటకపు స్వాతంత్య్రమనీ, బూటకపు రాజ్యాంగమనీ అవమానకరంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాను తగలపెట్టడానికి ప్రయత్నించారు. విద్యార్ధుల మధ్య నుంచి భగత్‌ సింగ్‌లాగా ముందుకు వచ్చిన జగన్‌ మోహన్‌ ఈ చర్యలను నిరసిస్తూ వారికి ఎదురు తిరిగాడు. కొద్దిమంది విద్యార్ధులతో కలిసి ఆర్‌.యస్‌.యు. వారిని అక్కడి నుంచి తరిమికొట్టి, తిరంగా జెండాను తిరిగి ఎగురవేసి జాతి గౌరవం నిలిపాడు. ఆ తర్వాత ప్రభుత్వం పతాకానికి జరిగిన అవమానంపై ఎంక్వైరీ వేసింది. జస్టిస్‌ శ్రీరాములు ఎంక్వైరీకి యూనివర్సిటీకి వస్తే ఆర్‌.యస్‌.యు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి విద్యార్థులెవరూ ముందుకు వచ్చే ధైర్యం చేయలేదు. ఇది గమనించిన జగన్‌ మోహన్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ముఖ్యమైన వారిపేర్లు చెప్పి ప్రధాన సాక్షిగా మారాడు.

ఇది ఆర్‌.యస్‌.యు. వారికి కంటగింపైంది. ప్రధాన సాక్షిగా కోర్టుకు వెళ్ళి వస్తున్న పలు సందర్భాల్లో జగన్‌ను చంపుతామంటూ ఆర్‌.యస్‌.యు, పి.డబ్ల్యు.జి. వారు హెచ్చరికలు చేశారు. అయినా ఆయన లెక్క చేయలేదు. 29 ఏప్రిల్‌ 1982న జగన్‌ కోర్టుకు హాజరై రిక్షాలో తిరిగి వస్తూ నిత్యం రద్దీగా ఉండే హన్మకొండ హెడ్‌ పోస్టాఫీస్‌ దగ్గరకు చేరుకోగానే, అక్కడ మాటువేసిన నక్సల్స్‌ గుంపు ఒక్కసారిగా జగన్‌పై కత్తులతో విరుచుకుపడి విచక్షణారహితంగా పొడిచారు. జాతీయ జెండాను రక్షించినందుకు, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి గణతంత్ర దినోత్స వాన్ని నిర్వహించినందుకు జగన అమరుడయ్యాడు. సామా జగన్‌ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, దేశాన్ని అవమానపరిచే శక్తులను తరిమికొట్టి, దేశ గౌరవాన్ని పెంచేందుకు పునరంకితం కావాలి... ఒక్కసారి యువత వాస్తవాలు గ్రహించాలి దేశ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.. జై హింద్