భారత వైమానిక దళ కసరత్తు, ఈశాన్య సరిహద్దుల వద్ద భద్రతా సన్నాహాలు, PoJK స్వాధీనం, చికెన్ నెక్ టు ఎలిఫెంట్ నెక్ గా మార్పు భారత వైమానిక దళం (ఐఏ...
భారత వైమానిక దళ కసరత్తు, ఈశాన్య సరిహద్దుల వద్ద భద్రతా సన్నాహాలు, PoJK స్వాధీనం, చికెన్ నెక్ టు ఎలిఫెంట్ నెక్ గా మార్పు
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ‘గజరాజ్’ పేరుతో నిర్వహిస్తున్న మహా కసరత్తు, భౌగోళికంగా సున్నితమైన ఈశాన్య ప్రాంతంలో సైనిక సర్వ సన్నద్ధతను మరింత పటిష్ఠం చేసే వ్యూహాత్మక చర్యగా పరిగణించబడుతోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం వంటి ప్రాంతాలు మరియు సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)లో ఈ విన్యాసం జరగనుంది. ఇది చైనాతో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) సమీపంలో ఉండటం వల్ల ప్రాధాన్యత సంతరించుకుంది. 1962 సినో-ఇండియన్ యుద్ధం, 2017 డోక్లాం స్టాండాఫ్ (భారత-చైనా-భూటాన్ మూడు జంక్షన్ల సమీపంలో) , 2020 గాల్వాన్ ఘర్షణలు (20 మంది భారత సైనికులు మరియు తెలియని సంఖ్యలో చైనా సైనికులు మరణించారు), 2022 తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో)సంఘర్షణలు ఈ ప్రాంతాన్ని ఉద్రిక్తతలకు కేంద్రంగా మార్చాయి. ఈ సంఘటనలు రెండు వైపులా పదివేల మంది సైనికులు, భారీ ఆయుధాలు మరియు మౌలిక సదుపాయాలను సరిహద్దు వెంబడి పెంపొందించడానికి మరియు భద్రతా చర్యలకు దారితీశాయి. చైనా లున్-జె ఎయిర్‌ఫీల్డ్ వద్ద 36 హార్డెన్డ్ షెల్టర్ల నిర్మాణం వంటివి చేపట్టడం వల్ల ఈ విన్యాసాలు భారత్ యొక్క రక్షణ మరియు భద్రత పరంగా దాయాది దేశాలకు ఒక సంకేతం అందిస్తాయి. అలాగే గజరాజ్ విన్యాసాల ద్వారా భారతదేశం తనయొక్క డిటరెన్స్ స్ట్రాటజీని ప్రపంచానికి తెలియజేస్తోంది.
కసరత్తు వివరాలు మరియు లక్ష్యాలు: అక్టోబర్ 31, 2025న జారీ చేసిన NOTAM ప్రకారం, వాయుసేన కసరత్తు ఆరు తేదీలలో జరుగుతుంది. నవంబర్ 6, 20 (2025); డిసెంబర్ 4, 18 (2025); జనవరి 1, 15 (2026). ప్రతి సెషన్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 నుంచి అర్ధరాత్రి 12:00 గంటల వరకు నడుస్తుంది. ఈశాన్య ఎయిర్‌స్పేస్ మొత్తం వాయుసేన, రక్షణశాఖ చేతిలోకి వెళ్తుంది. సివిలియన్ ఫ్లైట్లు మొత్తం రీరూట్ అవుతాయి. ఫోకస్ మొత్తం ఈశాన్య ఎయిర్‌స్పేస్‌పై ఉంది, చైనా (అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం సెక్టర్లు), భూటాన్ (డోక్లాం ప్రాంతం), మయన్మార్ (తూర్పు అరుణాచల్), మరియు బంగ్లాదేశ్ (సిలిగురి కారిడార్ సమీపంలో)తో సరిహద్దు జోన్లను కవర్ చేస్తుంది. 40కి పైగా ఫైటర్ జెట్లు (రఫేల్, సుఖోయ్-30ఎమ్‌కేఐ), డ్రోన్లు (సీ గార్డియన్, హెరాన్), హెలికాప్టర్లు (ప్రచండ్) ఈ ఈవెంట్ లో పాల్గొంటాయి.
లక్ష్యాలు: ఎయిర్-టు-ఎయిర్ కాంబాట్ సిమ్యులేషన్లు, మాక్ టార్గెట్లపై ఎయిర్-టు-గ్రౌండ్ స్ట్రైక్స్, సిమ్యులేటెడ్ ఎనిమీ టెరిటరీపై దాడులు, మరియు ఎడవర్సరీ రాడార్లను జామ్ చేయడానికి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ డ్రిల్స్, రాపిడ్ మొబిలైజేషన్ జరుగుతుంది. టెజ్‌పూర్, చబువా, హషిమారా బేస్‌ల నుంచి ఆపరేషన్లు జరుగుతాయి. ఇది మల్టీ-ఫ్రంట్ యుద్ధ స్ట్రాటజీలో సన్నాహాలు, ఎత్తైన ప్రాంతాలు, దట్టమైన అడవులు వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో మరియు అనుభవాన్ని అందుకోవడంలో సహాయపడుతుంది, అలాగే, యుద్ధకాలంలో స్ట్రాటజికల్ థింకింగ్ లో ఉపయోగపడుతుంది.
భౌగోళిక మరియు రాజకీయ నేపథ్యం: ఈశాన్య భారతదేశం యొక్క కఠిన పరిస్థితులు - సన్నని సిలిగురి కారిడార్ ద్వారా భారత్ యొక్క మెయిన్‌ల్యాండ్‌ను ఈశాన్యానికి దగ్గరగా చేయడం. చైనా ‘సలామి స్లైసింగ్’ టాక్టిక్స్ (క్రమంగా ఆక్రమించడం), భూటాన్‌లో గ్రామ నిర్మాణాలు, మయన్మార్ అస్థిరతలు మరియు సవాళ్లు. బంగ్లాదేశ్ యొక్క చైనా మరియు పాకిస్తాన్ తో సమన్వయం, ఈ సమస్యలన్నిటికీ భారత్ యొక్క సహకారం మరియు రక్షణ ఉంటుంది. ఇది యుఎస్-చైనా పోటీలో భారతదేశం స్వావలంబన (ఆత్మనిర్భర్ భారత్)ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. భారత్ తనకోసమే కాదు, తన మిత్రదేశాల రక్షణ కోసం కూడా పనిచేస్తోంది అని అంతర్జాతీయ సమాజానికి సందేశం అందించిన దేశంగా మారుతుంది.
కారణాలను స్పష్టంగా చెప్పకపోయినా, “ సన్నద్ధత మరియు సామర్థ్యాలు” అనే దృక్పథంతో ఈ కసరత్తు జరుగబోతోంది. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో, సరిహద్దు అవతలి నుంచి నిరంతర బెదిరింపులను ఎదుర్కోవడానికి ఈ కసరత్తు చాలా కీలకం. ఇదంతా ఒక ఎత్తు అయితే, అమెరికా వాడి ఒత్తిడికి చైనావాడు లొంగిపోయాడని తెలుస్తోంది. అమెరికా దిగుమతుల్లో చైనా నుండి జరిగే వ్యాపారం అత్యంత పెద్దది. అమెరికా ప్రజల సగటు అవసరాలు తీర్చడంలో చైనా తయారీ వస్తువులు బలమైన ముద్ర వేసాయి. ఒకరకంగా, చైనా తయారీ వస్తువుల ప్రాక్సీ జీవితం అమెరికన్లకు అలవాటు అయిపోయింది.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే, అమెరికా తదుపరి చూపు భారత్ వైపు ఉంటుంది. ఎలాగైనా భారత్ ను ఇబ్బంది పెట్టాలి అనే లక్ష్యంతో అడుగులు వేస్తాడు. మణిపూర్ అల్లర్లకు ప్రధాన కారణం అమెరికా సిఐఏ. అలాగే, బంగ్లాదేశ్ లో అమెరికా సానుకూల ప్రభుత్వం నడుస్తోంది. ఈశాన్యంలో, ముఖ్యంగా చికెన్ నెక్ ప్రాంతానికి కూత వేటు దూరంలో 1989 తరువాత బంగ్లాదేశ్ తన వైమానిక స్థావరాన్ని బలపరిచేవిధంగా అడుగులు వేస్తోంది. చైనా కూడా భారత్ కు 109 కిలోమీటర్ల దూరంలో విమాన స్థావరాన్ని ఏర్పాటు చేసింది. చైనావాడికి భారత్ యొక్క అవసరం అంతగా ఉండదు. చైనా తయారీ వస్తువులు అన్నీ అమెరికా వెళ్ళిపోతాయి. మొన్నటివరకు SCO మీటింగ్ లో వాళ్ళు చూపిన చొరవ మరియు ఇతర అంశాలన్నీ అటక ఎక్కిస్తారు. కాబట్టి, భారత్ కు అనుకూలంగా ఏ అంశంలోనూ వాళ్ళు ముందడుగు వేయరు. అదే సమయంలో బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ తో మనకు ఉన్న సరిహద్దు వివాదాలు వాళ్లకు అనవసరం అన్నట్లు ఉండరు. చైనా తన వంకర బుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. ఈశాన్యంలో ఇప్పటికీ మణిపూర్ లో పూర్తిస్థాయిలో శాంతి లేదు. అలాగే, చికెన్ నెక్ మరియు POJK సరిహద్దు అంశంలో పూర్తి స్థాయి సమాధానం రాబోయే పది నెలల్లో ఉంటుంది అని డిఫెన్స్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది సాధ్యం కావాలంటే ఈశాన్యంలో మన ప్రజల్లో మాత్రమే కాదు సైన్యంలో కూడా పూర్తిస్థాయి శిక్షణ మరియు సకారాత్మక ఆలోచన అవసరం. అందువల్ల, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయుసేన చాలా కీలకం.
దౌలత్ బేగ్ ఓల్డి ఎయిర్‌స్ట్రిప్ మరియు వ్యూహాత్మక ఆలోచన: దౌలత్ బేగ్ ఓల్డి ఎయిర్‌స్ట్రిప్ కారకోరం రేంజ్ బేస్ సమీపంలో మరియు చిప్ చాప్ నది సమీపంలో అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన భూభాగాలలో ఒకటిగా ఉంది. ఎయిర్‌స్ట్రిప్ చైనా సరిహద్దుకు దక్షిణాన 8 కి.మీ, భారతదేశం మరియు చైనా మధ్య అక్సాయ్ చిన్ వాస్తవ నియంత్రణ రేఖకు వాయవ్యాన 9 కి.మీ దూరంలో ఉంది.
DBO ఎయిర్‌స్ట్రిప్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్‌లలో ఒకటి, దాదాపు 17,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది 1962 చైనాతో యుద్ధం సమయంలో నిర్మించబడింది, అయితే 1965 నుండి ఇక్కడ ఆపరేషన్లు లేవు. 43 సంవత్సరాలుగా, ఈ అవుట్‌పోస్ట్ నుండి మళ్లీ ఆపరేట్ చేయడానికి ఢిల్లీ నుండి క్లియరెన్స్ లేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చాక చైనా తో గాల్వాన్ సంఘటనల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించింది.
మీకు తెలుసా? ఈ బేస్ చూసే చైనావాడు మనదగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటున్నాడు. SCO మీటింగ్ కావొచ్చు, అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్స్ సమస్యలు కావొచ్చు ఇవన్నీ కూడా వాడికి చిన్న విషయాలే కానీ, దౌలత్ బేగ్ ఓల్డి మాత్రం చాలా సున్నితమైన ప్రాంతం. అక్కడినుండి చైనా యొక్క సరిహద్దు (లైన్ ఆఫ్ ఆక్టువల్ కంట్రోల్ లో చాలావరకు మన కనుసన్నల్లో ఉంటుంది) ఇక్కడ పది సుఖోయ్, నాలుగు రాఫెల్ మరియు ఇతర యుద్ధ విమానాలు ఉంచితే చైనా పరిస్థితి ఏమిటి? అందువలన మనం చికెన్ నెక్ మరియు POJK పైన పూర్తి సమాధానం పొందడంలో వాడు మనకు అడ్డు రాడు. ఇక అమెరికావాణ్ణి నోరు మూపించడానికి మనం ట్రేడ్ ఆయుధాన్ని సుతి మెత్తగా వాడుతాము. వాడు మనవైపు చూడడు. అందుకే ట్రేడ్ అనేది మనకు అవసరమైనపుడు వాడుకోవాలి కానీ, మన నెత్తిన తుపాకీ పెట్టినపుడు కాదు.
భారత్ తన అవసరాలకోసం మాత్రమే కాకుండా, ప్రపంచ అవసరాలకోసం కూడా చూస్తుంది. అలా అని అనవసరంగా మీదపడి యుద్ధం చేయదు. కానీ, మనకు దక్కాల్సిన వస్తువును కోల్పోదు. మనం, కొడితే ప్రపంచంలో మేము చెప్పిందే జరగాలి కానీ వేరే ఏది నడవదు అనే అహంకార ధోరణితో విర్రవీగే దేశాలు కూడా ఏమి జరిగినా చూస్తూ ఉండటం తప్ప, ఏమీ చేయలేని స్థితిలో కూర్చోబెడతాము. ఈ మొత్తం అంశంలో మనతో పూర్తిగా కలిసి వచ్చే దేశం పాక్షికంగా రష్యా. -పతంజలి వడ్లమూడి. Vandebharat
For Regular Updates Join Our WhatsApp Group Vandebharath.
China cyber mafia, IAF drills northeast border, PoJK reclaim plan, Chicken’s Neck to Elephant’s Neck, Indian Air Force exercise, India China border security, Siliguri Corridor defence, Indian military preparedness

