భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు...
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ఆశ్రమానికి వెళ్లిన ట్రంప్.. అక్కడి మహాత్ముడి చిత్ర పటానికి నూలుమాల వేశారు. ఆ తర్వాత కాసేపు చరఖా తిప్పారు.
ఈ పర్యటన ద్వారా గాంధీజీ జీవితాన్ని తెలుసుకునే అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ట్రంప్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ‘గొప్ప స్నేహితుడైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఇదో అద్భుతమైన సందర్శన(సబర్మతి ఆశ్రమ పర్యటనను ఉద్దేశిస్తూ)’ అని ఇక్కడి సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాసుకొచ్చారు.