Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రాణా ప్రతాప్ గురించి ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు - unknown facts about rana pratap singh

హిందు ధర్మం!! మహా రాణా ప్రతాప్ గురించి మనకేవ్వరికి తెలియదు. కానీ ఒక్క సారి చదవండి. ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. విచిత్రంగా ప్...


హిందు ధర్మం!!
మహా రాణా ప్రతాప్ గురించి మనకేవ్వరికి తెలియదు. కానీ ఒక్క సారి చదవండి.
ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. విచిత్రంగా ప్రపంచంలోనే అత్యంత బలశాలి అయిన అమెరికా మెడలు వంచింది ఈ చిన్ని దేశం.
ఈ రెండు దేశాల నడుమ కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది వియత్నాం. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.
విలేకరి: ఇప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలవగలిగారు.?
విలేకరి అడిగిన ఆ ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం…
అన్ని దేశాలలోకెల్ల అత్యంత శక్తివంతం అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టుడు అయిన గొప్ప దేశభక్తిగల ఒక భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని వీరోచితగాథల నుండి, అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము.

విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?

విలేఖరి ఇలా అడగగానే వియత్నాం అద్యక్షుడు వెంటనే నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు.

అతడే… రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్

మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళు వీరత్వంతో వెలిగిపోయాయి.

అంతే కాదు అతను ఇంకా ఇలా అన్నాడు
ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.
అని.
కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు. అయితే అతని సమాధి మీద ఇలా వ్రాసారు “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుని సమాధి ” అని .

కాల క్రమేణా కొద్ది సంవత్సరాల తర్వాత వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు. ఆ తరువాత ఎర్రకోట,ఇంకా ఇంకా ఇలా చూపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.

అప్పుడు ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికెడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు….”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడు

మహారణా ప్రతాప్ సింహ్ గురించి మరి కొన్ని వివరాలు..


అతని పూర్తి పేరు..-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)

జన్మదినం-9 మే,1540

జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్

పుణ్యతిది-29 జనవరి,1597

తండ్రి – మహారాణా ఉదయ్ సింహ్ జి

తల్లి-రాణి జీవత్ కాంవర్ జి

రాజ్య సీమా-మేవాడ్

శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు)

వంశం –సూర్యవంశం

రాజవంశం-సిసోడియ రాజపుత్రులు

ధార్మికం-హిందూధర్మం

ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం

రాజధాని-ఉదయ్ పూర్

శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అతనికి అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.


అబ్రహం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి రావాల్సి ఉంది. అతను భారత్ కి బయలుదేరుతూ తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అడిగాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వాస పాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభ పెట్టినా తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో చదువ వచ్చు.

*మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు బరువు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.

*డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహా రాణా ప్రతాప్ ని ఒకసారి ” తల దించి నా కాళ్ళ మీద పడితే సగం హిందూస్థాన్ కి రాజుని చేస్తా ” అని ప్రలోభపెట్టాడు. కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా భావించి తిరస్కరించాడు..

*హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి

* మహారాణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.

* మహారాణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ల వాళ్ళ ఇళ్లను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వాళ్ల దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను.

* హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.

* మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్ర వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు

* మహారాణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.

* హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపుత్ మరొక పక్క భీల్ ఉంటారు.

* రాణా గుర్రం అయిన చేతక్ మహారాణాను 26 అడుగుల కందకం మీద నుంచి దూకి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందు కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.

*చేతక్ ఎంత బలమైనదంటే తన ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది. అది కూడా మహారాణాతో పాటుగా

*మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.

*శ్రీ మహారాణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల పదును ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన వద్ద ఉంచుకునే వాడు.

*మిత్రులారా మహార ణా ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు ,అంతే కాదు అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.

*అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంధంలో రాసుకున్నాడు.

* అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే.

మహారాణా ప్రతాప్ తో పాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట.

* రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఒక్కత్తే మొఘలుల 13 ఏనుగులని చంపిందట.అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట అని అల్ బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు.

*బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగ దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు.ఆ ఏనుగు ఎంత స్వామి భక్తి కలదంటే 18 రోజులవరకు దాణా తినకుండా,నీళ్ళు తాగకుండా తన ప్రాణాలు కోల్పోయింది.తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ ” ఈ ఏనుగుని వంచ లేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతాను “అని అన్నాడట.

* మన దేశంలో ఇలాంటి దేశభక్తుల్లో చేతక్,రాంప్రసాద్ లాంటి జంతువులు కూడా ఉన్నాయి.