Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తిరుపతి భాజపా అభ్యర్థి కొలిక్కి వచ్చినట్లేనా? - Vandebharath

తిరుపతి భాజపా అభ్యర్థి కొలిక్కి..?? తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో YCP అభ్యర్థి డాక్టర్.గురుమూర్తి ని అలాగే TDP నుండి పనబాక...

తిరుపతి భాజపా అభ్యర్థి కొలిక్కి..??
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో YCP అభ్యర్థి డాక్టర్.గురుమూర్తి ని అలాగే TDP నుండి పనబాక లక్ష్మి నిర్ణయం కాగా, జనసేన మరియు బిజెపి కలిసి పోటీచేయుటకు ఒక నిర్ణయం జరిగింది.. 
కాగా ఇంతవరకు అభ్యర్థి పేరును ఖరారు చేయకపోవడంతో ఎవరనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మొదటి నుంచి వినిపిస్తున్న రిటైర్డ్ IAS అధికారి Sreenivasulu Dasari గారి పేరు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది..
సంఘ పెద్దల నుంచి కూడా పూర్తి మద్దతు ఆయనకే లభించినట్లు తెలుస్తోంది..

ఈ నేపథ్యంలో దాసరి శ్రీనివాసరావు గారికి ఉన్న అర్హతలను పరిశీలిద్దాం..

👉  ఆయన ఎవరూ వేలెత్తి చూపలేని గొప్ప జాతీయ వాది. పూర్తి హిందూ ధర్మ నేపథ్యం ఉన్న కుటుంబం..

👉  విద్యార్థి దశలోనే తిరుపతి S. V. యూనివర్సిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకుడిగా విద్యారంగ సమస్యలు మీద అనేక ఉద్యమాలు చేసిన అనుభవం. అంతేకాకుండా 1975 లో ఎమర్జెన్సీ సమయంలో తిరుపతిలో ABVP నాయకునిగా జైలులో గడిపారు..

👉 సమరసత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా సుమారు 500 పైగా దేవాలయాలు SC, ST కాలనీల్లో నిర్మించడంలో కీలక పాత్ర.

👉  దేశం లో ఉన్నతమైన బాధ్యత నిర్వర్తించిన సివిల్ సర్వీసెస్ విశ్రాంత అధికారి. 5 శాఖల్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. అనేక జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అనేక శాఖల్లో డైరెక్టర్ కమీషనర్‌గా పనిచేశారు.

👉 తిరుపతి, నెల్లూరు జిల్లాలలో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా శ్రీ సిటీ, అప్పాచిలాంటి పారిశ్రామిక అభివృద్ధి వారు #ఇండస్ట్రీ_కామర్స్_ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న సమయంలోనే అభివృద్ధి చెయ్యడం.

👉  తిరుపతి లోక్ సభ పరిది ప్రజలందరికీ సుపరిచితుడు.

👉  తిరుపతి SV యూనివర్సిటీ లో వారి విద్యాబ్యాసం  పరిదిలో ప్రతి గ్రామం తో వీరికి మంచి సంబంధాలు.

👉  ముఖ్యంగా పేదలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలాందించటానికి అనేక NGO లతో కలిసి పని చేసుండడం... ఇప్పటికీ పని చేస్తూనే ఉండడం.

🔸 అతి తక్కువ కాలంలో తిరుపతి నియోజకవర్గం లో ఉన్నటువంటి BJP కార్యకర్తలు, మండలస్తాయి, జిల్లా, నియోజకవర్గ స్తాయి కార్యకర్తలందరితో సత్సంబంధాలు కలిగివున్న ఏకైక నాయకుడుగా పేరుండడం.

🔸 తిరుపతి లోకసభ పరిధిలో అత్యధిక జనాభా ఉన్న
షెడ్యూల్ క్యాస్ట్ కులస్తుల్లో గొప్ప వ్యక్తిగా పేరుండడం. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అనేక సంక్షేమ పథకాలు వారికోసం అమలు చేసిన వ్యక్తిగా... IAS ఆఫీసర్ గా సర్వీసులో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా ఆయనకి పేరుండడం.

🔸  లోక్ సభ పరిదిలో అత్యంత వెనుకబడిన యానాది కులస్తుల పరిస్థితుల మీద అవగాహనతో పాటు, అనేక ఏళ్లుగా వారి అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు చేసి 
వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం.

🔸 మత్స్యకార గ్రామాల్లో తరుచూ పర్యటనలు చేసి, మత్స్యకారులు  ఎదుర్కొంటున్న  సమస్యలు కేంద్రప్రభుత్వానికి నివేదికల పంపి వారి సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడడంతో పాటు మత్స్యకారులకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, బీజేపీ పార్టీ విధానాలను తీసుకెళ్లి ఉండడం అయిన అభ్యర్థిత్వానికి సానుకూల అంశాల్లో ఒకటి. #సంచారి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సంచార జాతులకు, గిరిజనులకు, సమాజానికి దూరంగా ఉన్న జాతులవారి అభివృద్ధికి పాటుపడుతూ, వారిని కన్వర్షన్ మాఫియా నుంచి కాపాడుతున్న ఆదర్శధార్మికవాది.

🔸 నియోజకవర్గ పరిదిలో ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత నిధులతో ప్రతి ఒక్కరికీ సహాయ సహకారం అందించిన మహా మనిషి.

🔸 వారు ఇండస్ట్రీ & కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో తిరుపతి, నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ, అప్పాచి, మేనకురు సెజ్ వంటి వాటిని వారి హయాంలో అభివృద్ధి చేసుండడం.

🔸 వారు పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి  శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన సమయంలోనే దేశంలో అత్యధికంగా గ్రామాలకు రోడ్లు వేసి గ్రామంలో మంచినీటి సౌకర్యం తో పాటు అనేక మౌలిక వసతులు కల్పించడంలో అధికారిగా వారిది కీలక పాత్ర.

🔸 అనేక సంవత్సరాలుగా గిరిజనుల అభివృద్ధి శాఖలో పని చేసి రాష్ట్రం గిరిజనుల అభివృద్ధిలో  అధికారిగా వారి పాత్ర ముఖ్యమైనది.

🔸 దాసరి శ్రీనివాసులు కాకినాడ పోర్ట్ ఎండీ గా ఉన్న సమయంలోనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ నిర్మాణంలో వారి సేవలు అమూల్యమైనవి.

🔸 వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న సమయంలో ఆనాటి ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన ఆనేక సంక్షేమ కార్యక్రమాల్లో అధికారిగా వారిది ముఖ్యపాత్ర.

🔸వారు  కార్మిక, ఉపాధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న సమయంలో వారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం 
చేసిన కృషి దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ప్రశంసలు అందుకున్నాయి,  రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, కార్మికుల భద్రత కోసం ఎన్నో సంస్కరణలు అమలు చేశారు.

🔸 దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం వారి చేసిన కృషి మరువలేనిది, దేవాలయ నిర్వహణలో అవినీతి నిర్ముల, భక్తులకు సౌకర్యాల కల్పనలో అనేక  అనేక సంస్కరణలు వారు తీసుకురావడం.

🔸 అలాగే విశ్వహిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్ పెద్దలతో, కార్యకర్తలతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి.

🔸 ముఖ్యంగా గెలిస్తే తనకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ తో తిరుపతి ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు.

🔸 స్వతహాగా దేశభక్తుడు, ధర్మారాధకుడు కావడం మూలాన తిరుపతి లాంటి ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి అవసరం ఉన్న ఏకైక నాయకుడు.

ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కి BJP సీట్ ని ఇచ్చినట్లయితే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని వందశాతం  చెప్పవచ్చు....