తెలంగాణ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలు, అవినీతి పై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శే...
తెలంగాణ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలు, అవినీతి పై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో అనేక సంవత్సరాలుగా వివాదాస్పద ఐపీఎస్ అధికారిగా పేరుగాంచిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహార శైలి ప్రశ్నార్థకంగా వుందని అయన ధ్వజమెత్తారు.
ఒక ప్రభుత్వ ప్రజా సేవకుడిగా వుండి సమాజంలో విభజన వాదాన్ని రెచ్చగొట్టి, హిందువుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాడని ఆరోపించారు, అరాచకాలు సృష్టిస్తున్నాడని, మతసామరస్యాన్ని విచ్చిన్నం చేసేవిధంగా, భంగం కలిగించే విధంగా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని శేఖర్ రావు విమర్శించారు.
హిందు మతం పై, హిందూ ధర్మం పై అయన తన మిత్రుల తో కలిసి విషం చిమ్మే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన తన మిత్ర బృందంతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడంపై వెంటనే దర్యాప్తు జరిపించాలని స్పష్టం చేశారు.
పైగా, తన యొక్క మానస పుత్రిక అయిన స్వేరో సంస్థ ద్వారా తన మిత్రులకు కేటాయించిన కాంట్రాక్టుల పై , బినామి ఆస్తులపై వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక అంచానా ప్రకారం సాంఘిక సంక్షేమ బాద్యతలు తీసుకున్నప్పటి నుండి రూ 500 కోట్ల కుంబకోణం చేసినట్టు తెలుస్తున్నదని ఆరోపించారు.
ప్రభుత్వ నియమాలకు భిన్నంగా రాజ్యాంగానికి విరుద్దంగా ఒక ప్రభుత్వ అధికారి గత అనేక సంవత్సరాలుగా చేసినటువంటి అక్రమాలు, అవినీతి వ్యవహారాలను సరియైన రీతిలో విచారణ చేయకుంటే పెద్ద ఎత్తున టి ఆర్ ఎస్ – కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని శేఖర్ రావు హెచ్చరించారు. వెంటనే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని సాంఘిక సంక్షేమ బాద్యతల నుంచి తప్పించి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, హిందూ దేవుళ్లను కించపరిచేలా పసి హృదయాల్లో విషబీజాలు నాటుతున్న ప్రవీణ్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ డివిజన్ దళిత మోర్చా నాయకులు, స్థానిక బీజేపీ నేతలు బుధవారం అబిడ్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు.
ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, క్రిస్టియన్ సంస్థలు అందిస్తున్న నిధులతో, దేశంలోని కొంత మంది హిందూ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి స్వేరోస్ అనే సంస్థను స్థాపించి తెలంగాణ అంతటా విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు. విద్యార్థులను వేధిస్తున్న స్వేరోస్ సంస్థను రద్దు చేయాలని, ప్రవీణ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వారు వివరించారు.