Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

దాసరిని నక్సల్స్ ఎందుకు కిడ్నాప్ చేశారు? - Vandebharath

  అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలన సంఘటన : విశాఖపట్నం, పాడేరు లో IAS అధికారి దాసరి శ్రీనివాసులుని నక్సల్స్ కిడ్నాప్ చెయ్యడం. వారి డిమ...


 

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలన సంఘటన:

విశాఖపట్నం, పాడేరు లో IAS అధికారి దాసరి శ్రీనివాసులుని నక్సల్స్ కిడ్నాప్ చెయ్యడం. వారి డిమాండ్లు తీర్చకపోతే చంపేస్తామని హెచ్చరికలు... ఏ పేపర్ చూసిన ఎక్కడ ఏ నలుగురు మాట్లాడుకున్న ఈ సంఘటన గురించే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు అందరి మాట ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వం కిడ్నాప్ అయిన అధికారులని ఎలా కాపాడతుంది... నక్సల్స్ వారిని విడుదల చేస్తారా.. లేక చంపేస్తారా..!! ఒకటే ఉత్కంఠ...

అసలేం జరిగింది దాసరిని నక్సల్స్ ఎందుకు కిడ్నాప్ చెయ్యాల్సి వచ్చింది....
కష్టాలు.. కఠిక పేదరికం నుంచి చదువుకుని తమలాగ కష్టాలు పడుతున్న అభాగ్యులకు ఎంతో కొంత సహాయం చెయ్యాలన్న తపన దాసరికి కొన్ని సార్లు ప్రాణాలు మీదకు తెచ్చింది. అలాంటి సంఘటనే పాడేరు లో అయిన కిడ్నాప్ వ్యవహారం... మహానుభావుడు పేద ప్రజలు గుండెల్లో గుడి కట్టుకుని పూజించే దైవం ఐఎఎస్  అధికారి స్వర్గీయ SR_శంకరన్ గారి తరుచు చెప్పే మాటలు... "ఆఫీసుల్లో కూర్చొని పేద ప్రజల సమస్యలు పరిష్కరించలేం"... అధికార యంత్రాంగం పేదలు ఎక్కడ  ఉంటే అక్కడికెళ్లి వారి సమస్యలను స్వయంగా చూసి పరిస్కారం చూపిస్తేనే పేద ప్రజలకు మేలు చెయ్యగలం అనే మాటలకు స్పూర్తి పొందిన దాసరి శ్రీనివాసులు గిరిజనుల సమీకృత అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ అయిన తరువాత  అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు చింతపల్లి, పాడేరు ఏజెన్సీ  ఏరియాల్లో విస్తృతంగా పర్యటించే వారు.
 
సహజంగా అక్కడ ఉన్న కొన్ని గిరిజన తెగలు బయట వారిని నమ్మరు, బయట వారిని వారి గూడెల్లోకి అనుమతించారు. దాసరికి ఏమో వారికి తినడానికి తిండి, వారు నివాసం ఉండే ప్రాంతాల్లోకి రోడ్లు, ఎలెక్ట్రసిటీ ఏర్పాటు చేసి వారి జీవన విధానంలో మార్పులు తేవాలని తపన. ఎన్ని సార్లు వారి తండాలు పరిశీలించలన్నా అక్కడి గ్రామాల వారు వారి పర్యటనని అడ్డుకుని కనీసం వారి తండాల్లోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు. అయిన అంతే పట్టుదలతో మళ్ళీ మళ్ళీ వారి గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పథకాలు. వారికి కావాల్సిన మౌలిక వసతుల గురించి చర్చించి దాసరి శక్తి మేరకు వారి సమస్యలను పరిష్కరించే వారు. ఆయన చేస్తున్న కృషి వల్ల  అమాయక గిరిజనుల జీవితాల్లో కొంత మార్పు రావడం మొదలయింది...

దానితో బాటే ఆయనకి సమస్యలు రావడం మొదలైనాయి. అప్పటికే ఏజెన్సీలో పటిష్ట నెట్వర్క్ కలిగిన మావోయిస్టులకి దాసరి కార్యక్రమాలతో, నిత్యం అధికారుల పర్యటనలతో ఇబ్బంది కలగడం ప్రారంభం అయింది. మావోయిస్టుల షెల్టర్ కి భోజన సదుపాయలకి ఇబ్బంది మొదలైంది. ఇక ఈ అధికారి ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే తమకు తల నొప్పులు అనుకున్నారు. ఎలాగైనా ఆయన్నీ అడ్డు తొలగించాలని ప్లాన్ చేశారు.  ఒక రోజు ఆయన తో పాటు మరి కొందరిని కిడ్నాప్ చేశారు. ఈ వార్త అక్కడ గిరిజన తండాల్లో ధావణంలా వ్యాప్తి చెందింది ఒక్క సారిగా అక్కడి గిరిజనులు కోపోద్రిక్తులు అయ్యారు ఇన్నాళ్లకి తమకి మేలు చేస్తున్న ఒక్కగానొక్క అధికారిని కిడ్నాప్ చెయ్యడంతో నక్సల్స్ కి ఎదురు తిరిగారు ఆయనకి హాని జరిగితే సహించేదే లేదన్నారు...
 
అక్కడ గ్రామాల్లో తీవ్రంగా వ్యతిరేకత రావడంతో మావోయిస్టులు తాము ఎంత మంచి ఆఫీసర్ ని కిడ్నాప్ చేసామో అర్ధం చేసుకుని లెంపలేసుకుని ఆయనకి దండం పెట్టి క్షమాపణలు చెప్పి గౌరవంగా విడిచిపెట్టారు.