Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

వరుస పేలుళ్ళ నిందితుడు ఆరిజ్ ఖాన్ కు ఉరిశిక్ష ఖరారు - vandebharath

దే శంలో 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన దోషి, ఇండియన్...


దేశంలో 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన దోషి, ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్‌ ఖాన్‌కు ఉరిశిక్ష విధించింది. అలాగే, రూ.11లక్షల జరిమానా కూడా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2008లో ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలలో 30మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. దేశ రాజధాని నగరంలోని కరోల్‌బాగ్‌, కన్నాట్‌ప్లేస్‌, గ్రేటర్‌ కైలాస్‌, ఇండియా గేట్‌ వద్ద బాంబు పేలుళ్లుకు తెగబడిన ఉగ్రవాదులు జామియా నగర్‌లోని ఎల్‌ -18 బాట్లా హౌస్‌లో దాక్కున్నట్టు ఇంటెలిజెన్స్‌ నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసుల బృందం అక్కడికి బయల్దేరి వెళ్లింది. ఆ సమయంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ చంద్‌ శర్మకు బుల్లెట్‌ తగలడంతో ఆయన వీరమరణం పొందారు. ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఆ సమయంలో అక్కడి నుంచి అరిజ్‌ ఖాన్‌, షాజాద్‌, జునైద్‌ తప్పించుకోగా.. మహ్మద్‌ సైఫ్‌ అనే మరో ముష్కరుడు పోలీసులకు లొంగిపోయాడు.

పరారైన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. 2010లో షాజాద్‌ను యూపీలోని అజాంగఢ్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిపై రెండు ఛార్జిషీట్‌లు దాఖలు చేయగా.. మోహన్‌చంద్‌ శర్మను హత్యచేసిన ఘటనలో 2013లో అతడికి జీవిత ఖైదు పడింది. 2018లో అరిజ్‌ఖాన్‌ను పోలీసులు భారత్‌ -నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఎన్‌కౌంటర్‌ కేసులో ఇటీవల అరిజ్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ న్యాయస్థానం అతడికి మరణదండన విధిస్తూ తీర్పు వెల్లడించింది. మరోవైపు, 2008లో ఢిల్లీ, రాజస్థాన్‌, గుజరాత్‌, యూపీలలో వరుస బాంబు పేలుళ్ల ఘటన వెనుక ప్రధాన సూత్రధారి కూడా అరిజ్‌ఖానే అని పోలీసులు అనుమానిస్తున్నారు.