SCO మీటింగ్ కంటే ముందే ఉగ్రవాదంపై భారత్ బలమైన సంకేతం! అంతర్జాతీయంగా భారత వైఖరిని గట్టిగా చెప్తూ, ఉగ్రవాదానికి సహించేది లేదన్న ఉద్దేశంతో భ...
SCO మీటింగ్ కంటే ముందే ఉగ్రవాదంపై భారత్ బలమైన సంకేతం!
అంతర్జాతీయంగా భారత వైఖరిని గట్టిగా చెప్తూ, ఉగ్రవాదానికి సహించేది లేదన్న ఉద్దేశంతో భారత సైన్యం, విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ఒకే స్థాయిలో గట్టి సందేశాలు పంపుతున్నాయి. చైనా వేదికగా జరుగుతున్న SCO (శాంఘాయ సహకార సంస్థ) మీటింగ్‌కి 48 గంటల ముందు భారత్ తీసుకున్న చర్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
నెల క్రితం రాజనాథ్ సింగ్ స్పష్టమైన దెబ్బ
ఒక నెల క్రితం రక్షణ మంత్రుల SCO సమావేశం చైనాలో జరిగింది. ఈ సమావేశంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా అగ్రిమెంట్‌పై సంతకం పెట్టమని కోరినప్పటికీ, భారత రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారు ధైర్యంగా “సంతకం పెట్టము” అని స్పష్టం చేశారు. భారత్ భావ ప్రకటన విన్న సార్వత్రిక సముదాయం ఆశ్చర్యపోయింది. దీని ద్వారా భారత్‌కి నిర్ణయాత్మక వైఖరి ఉందని తెలిసింది.
SCO మీటింగ్‌కు ముందు ఉల్ఫా క్యాంపులపై దాడి!
అంతేగాక, నిన్న(13-07-2025) ఉదయం అస్సాం సమీపంలోని ఉల్ఫా ఉగ్రవాద క్యాంపులపై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ చర్యతో భారత్ అంతర్జాతీయ వేదికపై ఘనమైన సైనిక బలాన్ని చూపించింది. ఈ దాడికి 48 గంటలకే విదేశాంగ మంత్రుల SCO మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇది సాధారణ చర్య కాదు – ఇది గంభీరమైన వ్యూహాత్మక సంకేతం.
జయశంకర్ చైనాలో – భారత్ సంకేతం స్పష్టంగా
ఈ రోజు ఉదయం భారత విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జయశంకర్ గారు చైనా వెళ్లారు. అక్కడ జరిగే విదేశాంగ మంత్రుల SCO మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, భారత సైన్యం ముందుగానే చైనాకు, ఇతర దేశాలకు స్పష్టంగా చెప్పేసింది –
“ఉగ్రవాదంపై మీరు నైతిక పాఠాలు చెప్తే మేము వినేది లేదు. చర్య తీసుకుంటాం!”
ఇది నయా భారత్… విశ్వగురు భారత్!
ఈ సాహసోపేతమైన చర్యలన్నీ “నయా భారత్ – విశ్వగురు భారత్” భావాన్ని మళ్లీ ప్రపంచానికి తెలియజేశాయి.
స్నేహం చేస్తే గౌరవంగా ఉంటుంది, కానీ భద్రత విషయంలో భారత్ ఇప్పుడు కాంప్రమైజ్ చేయదని స్పష్టంగా చూపించింది.
“స్నేహానికైనా, కాలు దువ్వడానికైనా నిర్ణయం మీకే వదిలేస్తాం” – ఇది నయా భారత్
ఈ ఘటనలు చూస్తే, భారత్ ఇప్పుడు మాటలకంటే చేతల రూపంలో ముందుకు సాగుతుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ స్టాండ్ ఇంకా పదిలమైంది.
For Regular Updates Join Our WhatsApp Group Vandebharath.
SCO Meeting 2025
, India China Relations
, ULFA Terrorist Camp Strike
, Rajnath Singh SCO
, Jaishankar in China
, Indian Army Action
, New India
, Vandebharath
News