బల్దియా ఎన్నికల సమయంలో మజ్లిస్‌తో సంబంధం లేదని ప్రకటించిన టి.అర్.ఎస్ నేతలు.. మేయర్ ఎన్నికలో ఆ పార్టీ మద్దతు ఎలా తీసుకున్నారని గోషామహల్ ఎమ్...
బల్దియా ఎన్నికల సమయంలో మజ్లిస్‌తో సంబంధం లేదని ప్రకటించిన టి.అర్.ఎస్ నేతలు.. మేయర్ ఎన్నికలో ఆ పార్టీ మద్దతు ఎలా తీసుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు. మేయర్ ఎన్నికలో టి.అర్.ఎస్, మజ్లిస్ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు.
గతంలోనూ ఈ రెండు పార్టీలే జీహెచ్ఎంసీని నాశనం చేశారని రాజాసింగ్ ఆరోపించారు. మేయర్ ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన మజ్లిస్.. తెరాసకు ఎందుకు మద్దతు తెలిపిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టి.అర్.ఎస్ కార్పొరేటర్లు ఇలాంటి పార్టీలో ఉంటారా.. బయటకొస్తారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టి.అర్.ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేస్తే తెరాసకు 15 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు.