మయన్మార్‌లో కుట్ర జరిపి అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ....
మయన్మార్‌లో కుట్ర జరిపి అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. . ఈ కుట్రను, ఏడాదిపాటు విధించిన ఎమర్జెన్సీని తాము ఖండిస్తున్నామని చెప్పారు. గత నవంబరులో ఆ దేశంలో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా తిరిగి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇటీవల మయన్మార్ లో ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకుని మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు నిరసనగా వేలాది మంది దేశంలో భారీ ర్యాలీలు చేపట్టారు. ఈ సైనిక నియంత ప్రభుత్వం వద్దని, ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్టులను తాము పరిగణనలోకి తీసుకున్నామని, కనీసం ఇప్పటికైనా సైనిక ప్రభుత్వం ఇదివరకటి పాలకులకు అధికారాన్ని అప్పగించాలని బైడెన్ కోరారు. లేని పక్షంలో మీ దేశానికి ఆర్ధిక పరమైన అన్ని సౌకర్యాలను స్తంభింప జేస్తామని ఆయన హెచ్ఛ్రించారు. (ఇదివరకటి) బర్మా ప్రభుత్వానికి గల అన్ని హక్కులనూ ధారాదత్తం చేయాలన్నారు. మీ సైనిక పాలకులకు అవసరామయ్యే అన్ని నిధులను స్తంభింపజేసి..వాటిని మీ దేశంలో ఆరోగ్య రంగకార్యక్రమాలకు, సివిల్ సొసైటీ గ్రూపులకు కేటాయించేలా చూస్తామని బైడెన్ పేర్కొన్నారు.
మా దేశంలో మీ సైనిక జనరల్స్ కోసం నిర్దేశించిన వందకోట్ల డాలర్ల విలువైన ఆస్తులను స్తంభింపజేస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు.ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తున్నా అన్నారు. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.