అహ్మదాబాద్: ఇండియన్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ తన వందో టెస్ట్ ఆడబోతున్నాడు. బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్ ఇషాంత్ కెరీర్‌లో...
అహ్మదాబాద్: ఇండియన్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ తన వందో టెస్ట్ ఆడబోతున్నాడు. బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్ ఇషాంత్ కెరీర్‌లో 100వ టెస్ట్. ఈ సందర్భంగా అతనితో తనకున్న స్నేహాన్ని షేర్ చేసుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఈ సందర్భంగా అతను తొలిసారి ఇండియన్ టీమ్‌కు ఎంపికైన సందర్భాన్ని గుర్తు చేశాడు. ఇషాంత్ స్టేట్ క్రికెట్‌ను నాతో కలిసి ఆడటం ప్రారంభించాడు. స్టేట్ క్రికెట్, రంజీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం మేమిద్దరం రూమ్ మేట్స్. అతడు తొలిసారి ఇండియన్ టీమ్‌కు ఎంపికైనప్పుడు మధ్యాహ్నం సమయంలో గురక పెట్టి పడుకున్నాడు. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి అతన్ని నేను తన్ని లేపాను. ఇద్దరం అంత క్లోజ్‌గా ఉండేవాళ్లం అని కోహ్లి ఆ సరదా ఘటన గురించి చెప్పాడు. ఇన్నేళ్లుగా అతను తన బౌలింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడని విరాట్ అన్నాడు.
ఇది గొప్ప ఘనత
ఓ పేస్ బౌలర్ వంద టెస్టులు ఆడటం సాధారణ విషయం కాదు. టీమిండియా తరఫున అయితే కపిల్ దేవ్ తర్వాత ఆ ఘనత అందుకోబోతున్న రెండో పేస్ బౌలర్ ఇషాంత్ కావడం విశేషం. దీనిపై కోహ్లి స్పందిస్తూ.. ఆధునిక క్రికెట్‌లో ఇదో గొప్ప ఘనత అని అన్నాడు. 100 టెస్టుల వరకూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అంత సులువు కాదు. పేస్ బౌలర్లలో ఇది చాలా అరుదు అని విరాట్ చెప్పాడు. నిజానికి అతడు వన్డేలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా.. టెస్ట్ క్రికెట్ పైనే పూర్తిగా దృష్టి సారించాడని కోహ్లి తెలిపాడు.