Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కేంద్ర మరో కీలక నిర్ణయం… Vandebharath

  దేశంలో బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చే...

 

దేశంలో బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా ఈ జాబితాలో ఓ బీమా కంపెనీ పేరు కూడా వినిపిస్తోంది.

ఇక దేశంలో ఎల్‌ఐసీ తర్వాత అగ్రగామిగా బీమా సంస్థగా ఉన్న ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలలో ఏదో ఒకదానిని ప్రైవేటీకరించే అవకాశలున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వీటి పేర్లను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే మూలధన సాయంతో ఈ రెండు బీమా సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఈ కంపెనీలను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.

అంతేకాకుండా ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగు పర్చేందుకు ఈ త్రైమాసికంలోనే మరో రూ.3 వేల కోట్ల మూలధన సాయం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థల్లో ఒకదానిని ప్రైవేటీకరించాలనే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లతో పాటు న్యూ ఇండియా ఇన్సురెన్స్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలపై మరి కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.