Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మహేష్‌ కుమార్‌ కిడ్నాప్‌: నలుగురి అరెస్టు - Vandebharath

  గుంటూరు: పిడుగురాళ్ల స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్‌ కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టులు పరిచినట్టు పట్టణ సీఐ ప్రభాకర్‌ తెలిపారు. సీఐ తెల...

 


గుంటూరు: పిడుగురాళ్ల స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్‌ కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టులు పరిచినట్టు పట్టణ సీఐ ప్రభాకర్‌ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన పల్లపు ప్రసాద్‌, బిర్లంగి నేతాజీ సుభాష్‌, బెండి సతీష్‌, బుడ్డి ప్రసన్నకుమార్‌... గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చెన్నూరి మహేష్‌కు పిడుగురాళ్లలో అమ్మకానికి ప్లాట్లు ఉన్నాయని, వస్తే చూపిస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మి మహేష్ కుమార్‌ డిసెంబరు 15న పిడుగురాళ్ల పట్టణంలోని ఆయేషా దాబా వద్దకు వచ్చారు. కాసేపటికి కిడ్నాప్‌ చేసి హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ ప్రాంతానికి కారులో తీసుకెళ్లి ఒక గృహంలో బంధించి కొట్టారు. రూ.75లక్షలు డిమాండ్‌ చేయగా రూ.19లక్షల నగదు వారికి అందజేశారు. ఆ తర్వాత రెండు విడతలుగా రూ.12లక్షలు, రూ.13లక్షలు నగదు ఇవ్వడంతో వదిలేశారు. ఘటనపై జనవరి 23న పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో మహేష్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితులను గురువారం అరెస్టు చేసి వారి వద్ద ఉన్న రూ.15లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ప్రభాకర్‌ తెలిపారు. నలుగురిని ఇవాళ కోర్టులో హాజరుపర్చారు.