Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అధ్యక్ష హోదాలో తొలిసారి చైనాకు బైడెన్ వార్నింగ్ - Vandebharath

  US America Relationsపై అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను నేరుగానే ఎదుర్కొంటామని కుండబద్దలు...

 


US America Relationsపై అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను నేరుగానే ఎదుర్కొంటామని కుండబద్దలుకొట్టారు.

విదేశాంగ శాఖ కార్యాలయంలో అధికారులను ఉద్దేశించి గురువారం తొలిసారిగా మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తన విదేశాంగ విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైనాకు ఆయన హెచ్చరికలు పంపారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను నేరుగా ఎదుర్కొంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో అమెరికాకు ప్రయోజనం చేకూరుతుందనుకుంటే ఆ దేశంతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు.

ఆర్థికపరమైన సవాళ్లు, మానవ హక్కుల ఉల్లంఘన, మేధోహక్కుల చోరీ, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి.. ఇలా చైనా నుంచి ఎదురవుతున్న ప్రతీ సవాల్‌ను సమర్థంగా తిప్పికొడతామని ఉద్ఘాటించారు. అంతేకాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ భాగస్వామ్య దేశాలైన భారత్‌, తైవాన్‌, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, జపాన్‌ పట్ల చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరిని సహించబోమని బైడైన్ తేల్చి చెప్పారు.

అలాగే, ప్రపంచ దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తామని, దేశాన్ని, విదేశాంగ విధానాన్ని తిరిగి గాడిన పెడతామని స్పష్టం చేశారు. అమెరికాను ఢీకొట్టాలన్న చైనా ఆశలను, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలదోయాలనుకుంటున్న రష్యా కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అదే సమయంలో మిత్రదేశాలతో ఏర్పడ్డ విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని అన్నారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న అణ్వాయుధాల ముప్పు, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి వంటి ఉమ్మడి సవాళ్ల విషయంలో అన్ని దేశాలతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని బైడెస్ నొక్కిచెప్పారు. వీటిని ఒంటరిగా పరిష్కరించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

అమెరికా ప్రజాస్వామ్య విలువల్లో పాతుకుపోయిన దౌత్యవిధానాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. స్వేచ్ఛా-స్వాతంత్రాలను పరిరక్షించడం, అవకాశాల్ని అందిపుచ్చుకోవడం, సార్వత్రిక హక్కులను కాపాడడం, చట్టబద్ధమైన పాలనను సమర్థించడం, ప్రతి పౌరుడి ఆత్మగౌరవాన్ని గుర్తించడం వంటి విలువలే అమెరికాను ప్రపంచ శక్తిగా మార్చాయన్నారు. అవే అగ్రరాజ్యానికి బలాన్ని, ప్రయోజనాన్ని చేకూర్చాయని స్పష్టం చేశారు.

‘మేము అంతర్జాతీయంగా అమెరికా పాత్రను పునరుద్ధరించడం ప్రారంభించాం.. భాగస్వామ్య సవాళ్లపై ప్రపంచ చర్యను ఉత్తేజపరచి మా నాయకత్వ స్థానాన్ని తిరిగి పొందుతాం’ అని అన్నారు. అంతకు ముందు, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మీడియాతో మాట్లాడుతూ.. చైనాలోని గోల్డ్‌మన్ సాచ్స్ స్వాధీనం చేసుకోవడం తమ ప్రాధాన్యత కాదని అన్నారు. ‘అమెరికా ఉద్యోగాలు, అమెరికాలోని కార్మికులకు హాని కలిగించే చైనా వాణిజ్య దుర్వినియోగాలకు అడ్డుకట్ట వేయడమే మా ప్రాధాన్యత’ అని ఆయన అన్నారు.