రుణ యాప్‌లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. ఆ యాప్‌లను తొలగించేం...
రుణ యాప్‌లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. ఆ యాప్‌లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్‌ను సంప్రదించాలని, రుణ యాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలంది. న్యాయవాది కళ్యాణ్దీప్ వేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయముర్తి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా చైనా రుణ యాప్‌ల వల్ల బాధితులు ఆత్మహత్య పాల్పడుతున్నారని పిటిషనర్ తెలిపారు. ఈ క్రమంలో రుణ యాప్‌ల వేధింపులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా నివేదికలు ఇవ్వాలని పేర్కొంది. రుణ యాప్‌లకు సంబంధించిన విచారణను హైకోర్టు మార్చి 18కి వాయిదా వేసింది.