హైదరాబాద్: గౌలిపురలోని శ్రీనివాస హైస్కూల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమయానికి స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమా...
హైదరాబాద్: గౌలిపురలోని శ్రీనివాస హైస్కూల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమయానికి స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో స్కూల్లో 50 మంది విద్యార్థులు పాఠశాలలో ఉండగా, వారందరూ.. సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది.