Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ప్రకటనలకు పరిమితులు! - Vandebharath

  - ఐపీఎల్‌లో ఆసీస్‌ క్రికెటర్లకు సీఏ షరతులు మెల్‌బోర్న్‌ :  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇక నుంచి...

 

- ఐపీఎల్‌లో ఆసీస్‌ క్రికెటర్లకు సీఏ షరతులు
మెల్‌బోర్న్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇక నుంచి ప్రాంఛైజీలు ఒప్పందం కుదుర్చుకున్న అన్ని బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించబోరు!. ఈ మేరకు ఐపీఎల్‌ ప్రాంఛైజీలకు పంపిన లేఖలో బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో రానున్న ఐపీఎల్‌ సీజన్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పరిమిత బ్రాండ్లకు మాత్రమే కనిపించనున్నారు. ఆల్కహాల్‌, ఫాస్ట్‌ ఫుడ్‌/ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్లు, పొగాకు, బెట్టింగ్‌కు సంబంధించిన ప్రకటనల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లను వినియోగించకూడదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) భారత క్రికెట్‌ బోర్డుకు తేల్చి చెప్పింది. అదే సమయంలో బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడే ఆటగాళ్లలో ఒక్కరి కంటే ఎక్కువ మందిని, రాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించే వారిలో ఒక్కరి కంటే ఎక్కువ మందిని ప్రచార కార్యక్రమాల్లో వాడుకోరాదని తెలిపింది. ఐపీఎల్‌లో 19 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చాలా మంది క్రికెటర్లు తాము ఆడుతున్న జట్టుకు కీలకంగా కొనసాగుతున్నారు. ప్రచార కార్యక్రమాల్లోనూ ఆసీస్‌ క్రికెటర్లను ప్రాంఛైజీలు ముందుంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా షరతులకు అనుగుణంగా ప్రాంఛైజీలు ప్రకటనలు, ప్రచార షెడ్యూల్‌ను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది.