తుంగభద్ర పుష్కరాలు ఈరోజు నుండే - vandebharath

 

తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి తుంగభద్రా నది పరివాహక ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 4 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. అయిజ మండలంలోని వేణి సోంపురం, ఉండవెల్లి మండలంలోని పుల్లూరు, రాజోలి మండల కేంద్రంతోపాటు అలంపూర్ పట్టణంలో పుష్కర ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం 1.21గంటలకు దేవగురు బృహస్పతి మకర రాశిలోప్రవేశించడంతో పుష్కరాలు  ప్రారంభమవుతాయని వేద పండితులు తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొననున్నారు. డిసెంబర్ 1తో పుష్కరాలు ముగియనున్నాయి. కరోనా రూల్స్​అనుసరించి అన్ని పుష్కర ఘాట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే భక్తులను పుష్కర స్నానానికి అనుమతిస్తారు. అన్ని ఘాట్ల వద్ద షవర్లు ఏర్పాటు చేశారు.

పుష్కరాలకు సంబంధించి ఫండ్స్​కేటాయించడంపై స్పష్టత కొరవడింది. ఏఏ ఘాట్ కు ఎన్ని ఫండ్స్​ కేటాయిస్తున్నారో ఇప్పటికీ క్లారిటీ లేదు. అలంపూర్ ఘాట్​లో మున్సిపాలిటీ నుంచి ఖర్చు చేస్తున్నారు. పుల్లూరు ఘాట్​కు సర్పంచ్​ నారాయణమ్మ ఇప్పటికే రూ.20 లక్షల దాకా ఖర్చు చేశామని చెబుతున్నారు. అసలు ఎన్ని ఫండ్స్​ ఇస్తారో తెలియదని ఆమె చెప్పారు.

Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]