అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 66వ జాతీయ మహాసభలు 25 26 వ తేదీలలో నాగపూర్ మహానగరంలో జరిగాయి. మహాసభలలో రాబోయే విద్యా సంవత్సరానికి ...
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 66వ జాతీయ మహాసభలు 25 26 వ తేదీలలో నాగపూర్ మహానగరంలో జరిగాయి.
మహాసభలలో రాబోయే విద్యా సంవత్సరానికి గాను నూతన జాతీయ కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షులు చంగాన్ భాయ్ పటేల్ ప్రకటించారు.
ఈ మహాసభలలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పాలమూరు జిల్లా మరికల్ మండలం కన్మనూర్ గ్రామానికి చెందిన నందిమల్ల రాజేష్ రెడ్డి ని జాతీయ అధ్యక్షులు ప్రకటించారు.
రాజేష్ రెడ్డి 2010 నుండి ABVP కార్యకర్త నుండి MVS డిగ్రీ కళాశాల అధ్యక్షునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా తదనంతరం 2014 నుండి పూర్తి సమయ కార్యకర్తగా మారుమూల ప్రాంతమైన అదిలాబాద్ జిల్లాలో అగ్ర సంఘటన కార్యదర్శిగా జిల్లా సంఘటన కార్యదర్శిగా, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ గా పనిచేసి హైదరాబాదులోని ఎల్బీనగర్ వీర పట్నం రెండు జిల్లాల సంఘటన కార్యదర్శి గా రంగారెడ్డి విభాగ్ సంఘటన కార్యదర్శి గా పని చేశారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా భాగ్యనగర్ విభాగ్ సంఘటన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యారంగ సమస్యలపై, సామాజిక సమస్యలపై మరియు నిరుద్యోగ సమస్యలపై అనేక ఉద్యమాలను నిర్మిస్తూ అనేక మంది కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏబీవీపీ నీ ముందుండి నడిపిస్తున్నారు. ఇది గుర్తించిన జాతీయ నాయకత్వం నందిమల్ల రాజేష్ రెడ్డి ని 2020 21 సంవత్సరానికి గాను జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకొంటున్నట్లు జాతీయ అధ్యక్షులు చంగన్ పటేల్ జాతీయ మహాసభల వేదిక గా ప్రకటించారు.