తిరుపతిలో యువతిపై పాస్టర్ అత్యాచారం - vandebharath
పాస్టర్ తన కుమర్తెను బెదిరించి అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి పేర్కొంది. సోమవారం స్పందనలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన బాధిత యువతి(20) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలను తల్లి బుధవారం ఆస్పత్రి వద్ద మీడియాకు వెల్లడించారు. ‘తిరుపతిలో పాస్టర్‌గా ఉన్న దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రాడక్ట్ కంపెనీలో మా పెద్ద కుమార్తె గత నెల 4వ తేదీన పనికి చేరింది.
ఈనెల 3న సాయంత్రం పాస్టర్ కారులో వచ్చి సరకు డెలివరీ ఇవ్వాలి రమ్మని పిలిచాడు. రేణిగుంట సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దిశ పోలీసుస్టేషన్‌కు వెళితే.. ‘అంత పెద్దవారితో నువ్వు పోరాడలేవు.. సిమ్ మార్చేసి మరో పని చేసుకోమని’ పోలీసులు సలహా ఇచ్చారు’ అని తెలిపారు. సోమవారం అదనపు ఎస్పీ సుప్రజకు స్పందనలో ఫిర్యాదు ఇవ్వగా గాజులమండ్యం పీఎస్‌కు పంపారు. ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని తెదేపా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్, టీఎన్‌ఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐ నాయకులు పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి ముందు పోలీసుల తీరుపై ధర్నాకు దిగారు.
Labels
news
Post A Comment
No comments :