Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

హైదరాబాద్ లో కరోనా ఉగ్ర రూపం - vandebharath

హైదరాబాద్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు విషయంలో గాని, కరోనా టెస్ట్ ల విష...


హైదరాబాద్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు విషయంలో గాని, కరోనా టెస్ట్ ల విషయంలో గాని గత రెండు, మూడు వారాలుగా రాష్ట్ర ప్రభుతం ఘోర నిర్లక్ష్యం జరుపుతూ ఉండగా నగరంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.
హైదరాబాద్‌ను కరోనా మహమ్మారి హడలెత్తిస్తోందిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించినట్లు కనిపిస్తున్నది. ప్రధాని మోదీ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. టెస్ట్ లు తగ్గించడంతో కొద్దీ రోజులు పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గినా క్రమంగా రికార్డ్‌ స్థాయిలో బయటపడుతున్నాయి.

హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తెలంగాణలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అవ్వన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,275కు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గుతున్నప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 21న తెలంగాణలో 56 కేసులు నమోదు కాగా,  ఆ తర్వాత అత్యధికంగా సోమవారం 79 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. మొత్తం కేసుల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి.

ఏప్రిల్‌21 నుంచి మే 10 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 392 కేసులు నమోదయితే అందులో 312కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివే. అందులో 222 కేసులు గత పది రోజుల్లో (మే నెలలో) నమోదైనవే. శనివారం (మే 9న) నమోదైన 31 కేసుల్లో 30.. ఆదివారంనాటి 33 కేసుల్లో 26, సోమవారం నాటి మొత్తం 79 కేసులు  జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
కార్వాన్‌ నియోజకవర్గంలోని జియాగూడ డివిజన్‌లో సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే ప్రాంతంలో ఒక్క మున్సిపల్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు 68 కేసులు నమోదు కాగా అందులో ఆరుగురు వైర్‌సతో మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలో 70 వరకు కేసులు నమోదవడంతో ఇక్కడ నివసిస్తున్న ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.  

సడలింపులతో హైదరాబాద్ రోడ్లపై ఒకేసారి వాహనాల రద్దీ పెరిగి పోయింది. సోమవారం ఒకేసారి 40 శాతం వాహనాలు రోడ్లెక్కాయి. మొత్తం 1.40 లక్షల వాహనాలు తిరిగిన్నట్లు చెబుతున్నారు. దానితో తిరిగి ట్రాఫిక్ జామ్ లు జరుగుతూ ఉండటం, సాంఘిక దూరం సాధ్యం కాకపోతు ఉండడం కనిపిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే కరోనా టెస్ట్‌లను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. రెండు రోజులుగా వలస కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. ఆదివారం ఏడుగురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వలస కార్మికులపై అధికారుల దృష్టి సారించారు. సరిహద్దుల వద్దే స్క్రీనింగ్‌, శాంపిల్స్‌ సేకరించి ప్రభుత్వ క్వారంటైన్లకు అధికారులు  పంపిస్తున్నారు