Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మన ఫామిలీ ఎకానమీని కొనసాగించడమే స్వదేశీ నమూనా - ఎస్ గురుమూర్తి - vandebharath

* ఎంఎస్ఎంఇ లకు భిన్నమైన నిబంధనలు అవసరం  * వలస కార్మికులపై అనవసర రాద్ధాంతం  నేడు ప్రపంచం అనుసరిస్తున్న మార్కెట్ ఎకానమీ మన దేశ పరి...* ఎంఎస్ఎంఇ లకు భిన్నమైన నిబంధనలు అవసరం 
* వలస కార్మికులపై అనవసర రాద్ధాంతం 
నేడు ప్రపంచం అనుసరిస్తున్న మార్కెట్ ఎకానమీ మన దేశ పరిస్థితులకు సరిపోదని, మనం ఫామిలీ ఎకానమీని కొనసాగించడమే స్వదేశీ నమూనా కాగలదని ప్రముఖ ఆర్ధిక వేత్త, తుగ్లక్ పత్రిక సంపాదకుడు ఎస్ గురుమూర్తి తెలిపారు.
'భారతీయ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం: సవాళ్లు, అవకాశాలు' అంశంపై ఆర్గనైజర్, పాంచజన్య పత్రికలు దేశ వ్యాప్తంగా గల సుమారు 40 వార్తా సైట్ లతో కలసి  జరిపిన  వెబనార్ లో ప్రసంగిస్తూ స్టాక్ మార్కెట్ లో నమోదైన కంపెనీలు మన జీడీపీలో కేవలం 5 శాతం మాత్రమే సమకూరుస్తున్నట్లు గుర్తు చేశారు. 
కుటుంభం వ్యాపారాలుగా సాగుతున్న ఎంఎస్ఎంఇ లు జీడీపీలో 50 నుండి 60 శాతం మేరకు సమకూరుస్తున్నాయని చెబుతూ వాటిని, కార్పొరేట్ కంపెనీలను ఒకే గాడిలో చూడటం తగదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రుణాల విషయంలో   అనుసరిస్తున్న తప్పుడు నిబంధనల కారణంగా   వీటిల్లో   సుమారు 80 శాతం వరకు కంపెనీలను  రుణాలకు అనార్హంగా పరిగణిస్తున్నామని చెప్పారు.
కార్పొరేట్ కంపెనీల మాదిరిగా ఎంఎస్ఎంఇ  లను కూడా 90 రోజులలో ఒక్క రోజు ఆలస్యంగా అయినా రుణాలు చెల్లింపని పక్షంలో మొండి బకాయిలుగా (ఎన్ పి ఎ) పరిగణించడం తగదని స్పష్టం చేశారు. తప్పుడు నిబంధనలతో 80 శాతం కంపెనీలను అనార్హంగా ప్రకటిస్తూ ఉండడంతో తమ వద్ద నిధులు ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఎవ్వరు ఉండడం లేదని వాపోయారు.
ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్ నుండి కాకుండా బ్యాంకుల నుండి, సమాజంలో తెలిసిన వారి నుండి నిధులు సమకూర్చుకొంటూ ఉంటాయని పేర్కొన్నారు. అందుకనే  ఎంఎస్ఎంఇ లకు భిన్నమైన నిబంధనలు రూపొందించామని ఆర్ బి ఐ, భారత ప్రభుత్వాలకు తాను సూచించానని తెలిపారు. ఎంఎస్ఎంఇ  లకు ఋణభారాన్ని ఒకేసారి పరిష్కిరేంచే పధకం ప్రకటించాలని సూచించారు.
కరోనా అనంతరం వ్యాపార స్వరూపం మారిపోగలదని గురుమూర్తి తెలిపారు. విమానాలలో తిరుగుతూ, ఖరీదైన హోటళ్లలో దిగుతూ, ఖరీదైన జీవనం గడిపే కార్పొరేట్ అలవాట్లకు అవకాశం తగ్గిపోయి మన ఆర్ధిక వ్యవస్థకు ఆధారమైన కుటుంభం తరహా వ్యాపారాలకు మంచి రోజులు రానున్నట్లు తెలిపారు.
పాశ్చాత్త దేశాల వలే కాకుండా మన సమాజం నమ్మకంపై ఆధార పడుతుందని, కేవలం వ్యక్తిగత నమ్మకంపై పెట్టుబడులు లభిస్తాయని, వ్యాపారాలు వికసిస్తూ ఉంటాయని వివరించారు. దేశ వ్యాప్తంగా కొన్ని సమూహాలు, కుటుంబాల ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాపారాలు అన్ని స్వదేశీ అనే చెప్పారు. 
మనం కొత్తగా స్వదేశీ నమూనా తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం అదే అమలులో ఉన్నదని చెబుతూ దానికి ప్రత్యామ్న్యాయంగా అవతరించిన మార్కెట్ ఎకానమీ మనదేశంలో విజయవంతం కీలక పోతున్నదని స్పష్టం చేశారు.
నేడు ప్రపంచమే రక్షిత నమూనా వైపు చూస్తూ ఉండడంతో మనం దేశంలో ఉన్న స్వదేశీ నమూనా వైపు మరోసారి చూసి, బలోపేతం చేయవలసి ఉన్నదని గురుమూర్తి సూచించారు. 
వీటిని బలోపేతం చేయడం ద్వారానే భారత్ గొప్ప ఆర్ధిక శక్తిగా ఎదగగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విచ్చలవిడి వినిమయ సంస్కృతికి  తిలోదకాలిచ్చి పరిమితంగా వినియోగం జరిపే ఆధునిక జీవన విధానాన్ని అలవరచుకోవాలి హితవు చెప్పారు.
వలస కార్మికుల గురించి అనవసరపు రాద్ధాంతం జరుగుతున్నదని చెబుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం 3.3 కోట్ల మంది ఉండగా కేవలం కొద్దీ లక్షల మంత్రి మాత్రమే స్వస్థలాలకు వెళ్లాలని కోరుతున్నారని గుర్తు చేశారు. అనధికారికంగా వలస కార్మికులు 30 కోట్ల మంది వరకు ఉన్నారని, వారంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నరని చెప్పారు.
ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు సహితం వలస కార్మికుల పట్ల తమ ధోరణి మార్చుకోవాలని గురుమూర్తి హితవు చెప్పారు. వారికి నాణ్యమైన జీవనం కల్పించడం, వారి మంచి - చెడుల గురించి పట్టించుకోవడం అవసరమని గ్రహించాలను సూచించారు.
Source: Nijam