ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కాల్చి చంపమని పిలుపిచ్చిన కేరళకు చెందిన ఒక సైనికుడిని అరెస్ట్ చేశారు.మలప్పురం జిల్లా...
ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కాల్చి చంపమని పిలుపిచ్చిన కేరళకు చెందిన ఒక సైనికుడిని అరెస్ట్ చేశారు.మలప్పురం జిల్లాలోని తిరురంగడి గ్రామంపై చెందిన మెహబూబ్ ను మిలిటరీ పోలీసులు అరెస్ట్ చేసిన్నట్లు తెలుస్తున్నది.
ఈ ఇద్దరు నేతలను చంపాలని పిలుపిస్తూ పేస్ బుక్ లోని పోస్ట్ ను సమర్ధించినందుకు అరెస్ట్ చేసారు. మెహబూబ్ నుండి ఏడు మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను 11 నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నట్లు భద్రతా ఏజెన్సీలు కనుగొన్నాయి.
పలువురు ఇస్లామిక్ బృందాలు చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ప్రచారంలో కూడా అతను క్రియాశీలంగా పాల్గొన్నట్లు కనుగొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధించే వారు తన స్నేహితుల జాబితాలో తొలగి పోవాలని పేస్ బుక్ పోస్ట్ లో మెహబూబ్ కోరారు.
`మానికుట్టన్ వావి' అని పేరుతో ఉన్న ఖాతాలో ఈ విధంగా వ్రాసాడు: "మీరు దయచేసి మోదీ, అమిత్ షా లను చాలా దగ్గర నుండి కాల్చి చంపండి. మీకు ఘన స్వాగతం పలకడానికి మేమున్నాం" అంటూ వ్రాసుకొచ్చాడు.
(ఆర్గనైజర్ నుండి)