Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

విశాఖపట్టణంలో ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది - vandebharath

  విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది. ఈ ఘ...

 
విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

రసాయన వాయువు లీక్‌ కావడంతో 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో అధికంగా చిన్నారులే ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

గంగరాజు అనే వ్యక్తికి వాయువు ప్రభావంతో కళ్లు కనబడకపోయేసరికి బావిలో పడి మృతి చెందాడు. కొందరు బైక్‌లపై వెళ్తూ కిందపడిపోయారు.  ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
 విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న నివాసాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ వాయువు ప్రభావంతో ఆవులు, దూడలు కూడా చనిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెట్లు పూర్తిగా మాడిపోయాయి.

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  విశాఖ  కలెక్టర్‌, కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి,  రసాయన వాయువు లీకైన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను జగన్‌ ఆదేశించారు.  ఆయన స్వయంగా విశాఖకు బయలుదేరుతున్నారు.