Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

విశాఖలో గ్యాస్ లీక్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్బ్రాంతి - vandebharath

  విశాఖలో గ్యాస్ లీక్ సంఘటనపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జా...

 
విశాఖలో గ్యాస్ లీక్ సంఘటనపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జాతీయ విపత్తు నివారణ అధికారుతో మాట్లాడినట్లు అమిత్ షా తెలిపారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులు వెంటనే కోలుకోవాలని అమిత్‌ షా ఆకాంక్షించారు.

ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘విశాఖపట్టణం శివార్లలోని ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన దురదృష్టకర ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్నెంతగానో కలిచివేసింది' అని పేర్కొన్నారు.

ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆయన  ప్రగాఢ సానుభూతి తెలిపాను. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడిన్నట్లు తెలిపారు.

కాగా, విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.