Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

భోపాల్ గ్యాస్ లీక్ అంతటి ప్రమాదకరమా? - vandebharath

  చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక ప్రమాదంగా పేరొందిన భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనను విశాఖపట్నంలో నేటి గ్యాస్ లీక్ పలువురికి గుర్...

 
చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక ప్రమాదంగా పేరొందిన భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనను విశాఖపట్నంలో నేటి గ్యాస్ లీక్ పలువురికి గుర్తుకు తెస్తున్నది. అయితే దీని తీవ్రత ఏమేరకు ఉంటుందో మరో రోజు ఆగితే గాని తెలిసే అవకాశం లేదు. సుమారు 300 మంది ఈ గ్యాస్ పీల్చి అస్వస్థకు గురైనట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.

26 ఏళ్ళ క్రితం జరిగిన భోపాల్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారం 4,000 లోపుగానే ఉన్నప్పటికీ, అంతకు నాలుగు రేట్లు ఎక్కువగా చనిపోయి ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో అంగవైకల్యం వంటి పలు రుగ్మతల ప్రభావం ఇంకా కనిపిస్తున్నది. విశాఖ ప్రమాద తీవ్రంగా వెంటనే చెప్పడం సాధ్యం కాదని వైద్య నిపుణులు పేరుకున్తున్నారు.

విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా చుట్టుప​క్కల 5 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 

లాక్ డౌన్ నుండి పారిశ్రామిక కార్యకలాపాలకు సడలింపు ఇవ్వడంతో తెరుచుకున్న ఈ ఫ్యాక్టరీ లో మరుసటి రోజుకే ఇటువంటి ప్రమాదం జరగడం దిగ్బ్రాంతి కలిగిస్తున్నది. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి పీవీసీ (పాలీవినైల్‌ క్లోరైడ్‌) గ్యాస్‌ లీక్‌ అయినట్లు అక్కడి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పీవీసీ గ్యాస్‌ను అన్ని ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో వినియోగిస్తారు. పీవీసీ లేకుండా ఏ ప్లాస్టిక్‌ను కూడా తయారు చేయలేరు. ప్లాస్టిక్‌ను తయారు చేసే క్రమంలో పాలీవినైల్‌ క్లోరైడ్‌లోని క్లోరిన్‌ వాయువు లీకైతే అత్యంత ప్రమాదం. ఇప్పుడు ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో అదే జరిగింది.

లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమను తెరిచే క్రమంలో అత్యంత ప్రమాదకరమైన క్లోరిన్‌ వాయువు లీకైంది. ఈ క్లోరిన్‌ అధిక గాఢత కలిగి ఉండటం వల్ల ఆ వాయువును పీల్చిన వెంటనే ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి.