Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి మరో ఇద్దరు మహిళలు

శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి మరో ఇద్దరు మహిళలు పోలీసుల అండతో విఫల ప్రయత్నం చేసారు. స్వామి అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు మరో ఇద్దరు మహి...

శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి మరో ఇద్దరు మహిళలు పోలీసుల అండతో విఫల ప్రయత్నం చేసారు. స్వామి అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు మరో ఇద్దరు మహిళలు ప్రయత్నించడంతో శబరిమల ఆలయ సమీపంలో బుధవారం మళ్లీ నిరసనలు పెల్లుబికాయి.
50 ఏళ్ల లోపు వయసుగల ఇద్దరు మహిళలు పంప బేస్ క్యాంప్ నుంచి ఆలయం వైపు బయల్దేరడంతో నిరసనకారులు వారిని చుట్టుముట్టారు. పోలీసుల రక్షణతో కొద్దీ దూరం వెళ్లగలిగినప్పటికీ వారు ముందుకు సాగలేక పోయారు. దానితో శబరిమల పరిసర ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పంబ బేస్‌ క్యాంప్‌ దాటి వెళ్తుండగా నీలిమల వద్ద వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆ మహిళలను తమ వాహనంలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. తొమ్మిదిమంది మహిళల బృందంలో వీరిద్దరూ సభ్యులని తెలుసోతంది. అయితే మిగిలిన ఏడుగురు మహిళలను కూడా నిరసనకారులు పంబ బేస్ క్యాంప్ వద్దనే అడ్డుకున్నారు.
కన్నూరుకు చెందిన  ఇద్దరు మహిళలు ఎవరికి అనుమానం రాకుండా పురుషుల దుస్తుల్లో తెల్లవారుజామున 5 గంటల సమయంలో  శబరిమల దర్శనానికి వచ్చారు. దాదాపు 5 కిలోమీటర్లు నడిచారు. అయితే వీరిని ఆందోళనకారులు గుర్తించి అడ్డుకున్నారు. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో మహిళలు మరికొంత దూరం ముందుకువెళ్లారు.

అయితే నీలిమల వద్ద పెద్దసంఖ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం మహిళలను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.