కేరళలోని శబరిమల ఆలయంలోకి సాంప్రదాయాలను ధిక్కరించి, ప్రభుత్వం అండతో ఇటీవల ప్రవేశించి తీవ్ర అలజడి కలిగించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గ ఇం...
కేరళలోని శబరిమల ఆలయంలోకి సాంప్రదాయాలను ధిక్కరించి, ప్రభుత్వం అండతో ఇటీవల ప్రవేశించి తీవ్ర అలజడి కలిగించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గ ఇంటికి తిరిగి వెడితే తీవ్ర ప్రతిఘటన ఎదురైనది. ఆమె పోలీసులతో కలసి వచ్చినా, ఇంటి బైట ఉన్నా ఇంట్లో కుటుంభం సభ్యులే ఆమెపై దాడికి పాల్పడిన్నట్లు పోలీసులు తెలిపారు.
కనకదుర్గపై ఆమె అత్తింటివారు దాడి చేసినట్లు తెలుస్తోంది. సంస్కృతి, సంప్రదాయాలను మరచి ఎంత చెప్తున్నా వినకుండా అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆచారాలను మంటగలిపిందంటూ ఆమెపై చేయిచేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన దుర్గ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సొంత అత్తగారే కనకదుర్గ తలపై బలంగా మోదిందని, ప్రస్తుతం మల్లాపురం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కనకుదుర్గ చికిత్స పొందుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కనకదుర్గ ఆరోగ్య పరిస్థితి నిలికడగానే ఉందని చెబుతున్నారు.
గత జనవరి 2న శబరిమల ఆలయంలోకి 39 ఏళ్ల కనకదుర్గ, 40 ఏళ్ల బిందు అమ్మిని ప్రవేశించారు. దీంతో ఆలయం అపవిత్రమైందంటూ ఆలయం తలుపులు మూసేసిన పూజారులు సంప్రోక్షణ అనంతరం గుడి తలుపులు తెరిచారు. హిందూ సంప్రదాయాలను గౌరవించే తమ కుటుంబంలోని మహిళ ఆలయం ప్రవేశించిందంటే నమ్మలేకున్నానని, దీని వెనుక బలమైన కుట్రే ఉందని అప్పట్లో కనకదుర్గ సోదరుడు వ్యాఖ్యానించారు.
తన సోదరిని భయపెట్టి ఆలయానికి తీసుకువెళ్లి ఉంటారని, ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియడం లేదని కూడా ఆయన అన్నారు. కనకదుర్గ ప్రాణాలకు ముప్పుకూడా ఉందన్నారు. కోజికోడ్‌లోని కనకదుర్గ ఇంటిముందు నిరసనలు కూడా జరిగాయి. దీంతో బిందు, కనకదుర్గ గత రెండు వారాలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అక్కడ్నించే వారు తమకు బెదరింపులు వస్తున్నాయని, అధికారులు తమకు తగిన భద్రత కల్పించాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఇంటికి తిరిగివస్తుండగా కనకదుర్గపై సొంత అత్తే దాడి చేయడంతో ఆమె తలకు గాయమై ఆసుపత్రిపాలైంది.