Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అవినీతికి తాము అడ్డుకట్ట వేస్తున్నందుకు కాంగ్రెస్‌ ఆగ్రహంతో ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అవినీతికి తాము అడ్డుకట్ట వేస్తున్నందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆగ్రహంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మంగళవారం ఒడిశాలో పర...

అవినీతికి తాము అడ్డుకట్ట వేస్తున్నందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆగ్రహంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మంగళవారం ఒడిశాలో పర్యటిస్తున్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొలంగిర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  మాట్లాడుతూ ‘ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రజలకు అందాల్సిన నిధులను మధ్యవర్తులే దోచుకునేవారు. ఈ తీరుకి మేము అడ్డుకట్ట వేశాము. అవినీతిని అడ్డుకున్నామని ప్రతిపక్షం ఆగ్రహంతో ఉంది. పేదల డబ్బును దోచుకున్న ఎవ్వరినీ ఈ కాపలాదారుడు వదలడు.. శిక్షపడేలా చేస్తాడు. మేము పిల్లలకు విద్య, యువతకు ఉద్యోగాలు, పెద్దవారికి వైద్యం, రైతులకు నీరు అందించడం కోసమే పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

‘గత ప్రభుత్వం సుల్తాను రీతిలో పాలన కొనసాగించింది. దేశ గొప్ప సంస్కృతిని నిర్లక్ష్యం చేసింది. మన ప్రాచీన సంపద అయిన యోగాను కూడా వారు అర్థం చేసుకోవట్లేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరస్కరిస్తున్నారు’ అని మోదీ విమర్శించారు. ఎవరి హక్కులకూ భంగం కలగకుండా తాము ఐటీవల తీసుకొచ్చిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా.. ఒడిశాలో సామాజికంగా వెనుకబడిన వారికి చాలా ఉపయోగపడుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు.
తూర్పు భారత్‌ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్డీఏ కృషి చేస్తోందని చెబుతూ  రూ.1,550 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఒడిశా అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కెండ్రపర, పూరీ, జగత్‌సింగ్‌, బార్గఢ్‌, కంధామల్‌, బొలంగిర్‌ ప్రాంతాల్లో ఐఒప్పుడు కొత్తగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పడ్డాయిని తెలిపారు.
‘ఈ నాలుగేళ్లలో దేశంలో మేము పెద్ద మొత్తంలో అక్రమ రేషన్‌కార్డులు, గ్యాస్‌ కనెక్షన్‌లు, స్కాలర్‌షిప్‌లను రద్దు చేశాం. దీంతో కోట్లాది రూపాయలను పొదుపుచేశాం. అన్ని రేషన్‌కార్డులను డిజిటలైజ్‌ చేశాం. 80 శాతం రేషన్‌కార్డులను ఆధార్‌ కార్డులతో అనుసంధానం చేశాం' అని ప్రధాని వివరించారు.
ఒడిశాలో ఒక్క నెలలో రూ.20,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించామని చెబుతూ  ఒడిశా ఇప్పుడు గొప్ప పర్యాటక ప్రాంతంగా మారిందని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.4,000ను ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించలేకపోయిందని అంటూ నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ప్రధాని మండిపడ్డారు.