రానున్న ఐదేళ్లలో పార్టీలకు అతీతంగా అందరితో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా పరిపాలన చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖ...
రానున్న ఐదేళ్లలో పార్టీలకు అతీతంగా అందరితో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా పరిపాలన చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును గోషామహల్ ఎమ్మెల్యే, బిజెపి నేత రాజాసింగ్ కోరారు. రాజ్‌భవన్‌లో ఈరోజు జరిగిన సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఏకపక్షంగా టీఆర్‌ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని.. ఎలాంటి పార్టీలకు దగ్గరగా ఉండాలన్నది కేసీఆరే ఆలోచించుకోవాలని సూచించారు. మజ్లిస్‌ను దగ్గర పెట్టుకుంటే టీఆర్‌ఎస్ కే నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు మజ్లిస్ ఎవరితో కలిసి ఉంటే వారికి నష్టమే జరిగింది తప్ప లాభం చేకూరలేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బిజెపి నుంచి రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. టీఆర్‌ఎస్ కు చెందిన సమీప ప్రత్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై 17,734 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేసిన బిజెపి గోషామహల్ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకోగలిగింది.
గత శాసనసభలో బిజెపి నుండి తాము ఐదుగురం సభ్యులు ఉండగా ఇప్పుడు తనఒక్కడినే ఎన్నిక కావడం బాధగా ఉన్నదని చేశారు. అయితే అధైర్య పడకుండా మిగిలిన 118 మంది సభ్యులకు జవాబు చెప్పే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
తనను ఓడించడం కోసం ఒకవంక టీఆర్‌ఎస్ , మరోవంక ఏఐఎంఐఎం నేతలు కుట్రపూరితంగా పని చేసారని ఆరోపించారు. తన 3నియోజకవర్గంలో 32 వేల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారని చెప్పారు.
తాను నమోదు చేయించిన కొత్తవారికి కూడా ఓట్లు రానీయలేదని అంటూ ఈ విషయంలో వారికి మునిసిపల్, ఎన్నికల కమీషన్ అధికారులు సహకరింఏ చారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లను బైండోవర్ చేసిన పోలీసులు తన నియోజకవర్గంలో మాత్రం వారిని స్వేచ్ఛగా వదిలి వేశారని, వారంతా తనకు ఓట్లు వేయవద్దని ఓటర్లను భయపెడుతూ వచ్చారని విమర్శించారు. ఈ విషయమై పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. .
ఒకొక్క కుటుంభానికి రూ 10 వేలు చొప్పున నగదు పంపిణి చేసినా ఘోషమహల్ ప్రజలు తనకు మద్దతు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. వారికి ఎప్పటికి కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు. 2024 నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా బీజేపీకి ఎదిగి, అధికారం చేపట్టే విధంగా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.