Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఎ పి కి 14 వేల కోట్లు ఇచ్చాము.. కేంద్ర సహాయం

 ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ కు రూ.14,310 కోట్లు ఇచ్చామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారామ్‌ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ...



 ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ కు రూ.14,310 కోట్లు ఇచ్చామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారామ్‌ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 అమలుపై ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రిత్వ శాఖలు, డిపార్డుమెంట్లతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందని తెలిపారు. గత సమీక్షా సమావేశం అక్టోబర్‌ 15న నిర్వహించామని పేర్కొన్నారు. 


విభజన చట్టంలోని ఎక్కువ అంశాలను అమలు చేశామని, షెడ్యూల్‌ 13లోని ప్రాజెక్టులతో సహా విభజన చట్టంలోని మిగతా అంశాల అమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కొన్ని ప్రాజెక్టుల అమలు దీర్ఘకాలికమైనవని చెప్పారు. పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల స్థిరమైన అభివృద్ధి, పురోగతికి అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌, సెక్షన్‌ 93లో పేర్కొన్నదని గుర్తు చేశారు.

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.14,310.01 కోట్లు విడుదల చేశామని, తెలంగాణకు రూ.1,800 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన చట్టంలో తెలిపిన విధంగా కేంద్ర విద్యాసంస్థలను నెలకొల్పామని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం ప్రకటించిందని మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పి.రాధాకృష్ణన్‌ సమాధానం ఇచ్చారు. 2015-16 నుంచి 2019-20 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల వాటా 90:10 కింద ఇవ్వనున్నామని తెలిపారు. వనరుల గ్యాప్‌కు రూ.3,979.50 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.1,050 కోట్లు, నూతన రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6,764 కోట్లు, ఈఎపి 15.81 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 

2014-17 వరకు మూడు ఏళ్లలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను మూడు విడుతలుగా ఒక్కొ జిల్లాకు 50 చొప్పును ఏడు జిల్లాలకు రూ. 1,050 కోట్లు ఇచ్చామని, కానీ 946.47 కోట్లుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్‌ సర్టిఫికేట్స్‌(యుసి)లు సమర్పించిందని మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది విడుదల చేసిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నామని తెలిపారు.

మహిళలపై పెరిగిన అత్యాచారాలు   

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు స్వల్పంగా పెరిగినట్లు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ రాజ్యసభలో వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంధించిన సమాచారం ప్రకారం దేశంలో అత్యధిక ఆత్మహత్యలు సంభవిస్తున్న ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని చెప్పారు. 

రాష్ట్రంలో సగటున ప్రతి లక్ష మందిలో 28 మంది పురుషులు, 21 మంది మహిళలు బలవన్మరణాలకు పాల్పుడుతున్నట్లు లానె్సట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలిందని హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణలో సగటున ప్రతి లక్షమంది పురుషుల్లో 24 మంది, మహిళల్లో 19 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కూడ మంత్రి వెల్లడించారు.