Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పులి వోడినా గెలిచినా పులి పులే.‌‌.. అలాంటి వారే శివరాజ్

ఎన్నికల్లో గెలవడం.. ఓడిపోవడం అన్నది దైవ నిర్ణయాలు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అద్భుత పాలన అందించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇటీవల జరిగిన ఎన్నిక...


ఎన్నికల్లో గెలవడం.. ఓడిపోవడం అన్నది దైవ నిర్ణయాలు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అద్భుత పాలన అందించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయాడు. ఇటీవల మధ్యప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో 230 స్థానాలకు గాను కాంగ్రెస్ 114 సీట్లను గెలుచుకోగా బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్ వాదీ పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.    ఇలాంటి తరుణంలో ఆయన అనుచరులు, నియోజకవర్గ ప్రజలు చాలా బాధతో ఉన్నారు. వారితో ఆయన చెప్పిన డైలాగ్ ఆయనలోని కాన్ఫిడెన్స్ ను బయటపెట్టింది. 

 'టైగర్ జిందా హై' అంటే 'పులి ఇంకా బతికే ఉంది'.. ఇదీ బాలీవుడ్ లో మాంచి డిమాండ్ ఉన్న డైలాగ్.. ఇదే పేరుతో సల్మాన్ ఖాన్ సినిమా కూడా తీశారనుకోండి.  ఈ వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ నోటి నుంచి వచ్చాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పులి ఇంకా బతికే ఉందని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  మీకు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. తాను ఇక్కడే ఉన్నానని. పులి బతికే ఉందని అన్నారు.