Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి

శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరుకాబోతున్న ఈ మహా సంబురం వేళ అయోధ్య సరికొత్తగా...


శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరుకాబోతున్న ఈ మహా సంబురం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లబోతోంది. లక్షలమంది హాజరయ్యే భవ్య రామ మందిర మహా సంరంభ వేడుకకు నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ మహాత్కార్యంలో తామూ భాగస్వాములయ్యేందుకు భక్తజనం ఉవ్విళ్లూరుతోంది.

జగదానంద కారక.. జయ జానకి ప్రాణ నాయక .. శుభ స్వాగతం.. ప్రియా పరిపాలక మంగళకరం నీరాక… మా జీవనమే పావనమవుగాక… అంటూ భక్తకోటి ఆశ్రీరాముడ్ని తలచుకుని పాడుతోంది. భవ్యరామమందిరంలో మన రామయ్య కొలువయ్యేనాటికి ఎన్నో అద్భుతాలు సాత్కారించబోతున్నాయి. ఆ అద్భుత మహాయజ్ఞంలో మన తెలుగోళ్ల పాత్రఘనంగా ఉంది.

2024 జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన.. భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయమైంది. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల శుభ ముహుర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అంటే శతాబ్దాల యావత్ హిందువుల కల 84 సెకన్లలో పరిపూర్ణమవుతుంది. మేషలగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ పవిత్ర సమయంలో గురు ఉచ్చస్థితి ఉండవల్ల రాజయోగం కలుగుతుంది. సాధారంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభముహుర్తంగా పరిగణిస్తారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడం మరో విశేషం.

భూకంపాలు.. సునామీ.. ఎలాంటి ప్రళయాలు వచ్చినా సరే.. అయోధ్య ఠీవీ ఇంచు మాత్రం కూడా చెక్కు చెదరదు. అయోధ్య భవ్య రామమందిరం అర్కిటెక్చర్‌ను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది. రామమందిరం ప్రకృతి లో ఎటువంటి విపత్తి ఏర్పడినా చెక్కు చెదరకుండా.. పటిష్టంగా ఉండేలా అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్‌, ఫర్నీచర్‌, వస్తువులను వినియోగించారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణంలో మేము సైతం అంటూ అనేక మంది భక్తులు పాలు పంచుకుంటున్నారు. ఆలయ నిర్మాణంలోసికింద్రాబాద్ లోని న్యూ బోయినపల్లిలో ఉన్న అనూరాధ టింబర్ డిపో పాలుపంచుకుంది. తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు 60 మంది ఈ తలుపులను తయారుచేశారు.

రామయ్యకు దేశం నలుమూలలనుంచి పెద్ద ఎత్తున కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామయ్యకు నేపాల్‌ జనకపూర్‌ అత్తవారింటినుంచి స్పెషల్‌ స్వీట్స్‌, వెండి బాణం కానుకలుగా వచ్చి చేరాయి. మరోవైపు తిరుమల శ్రీనివాసుడు కూడా లక్ష లడ్డూలు పంపారు.. మరో భక్తుడు రాములోరికి స్వచ్ఛమైన నేతి లడ్డూలను ప్రసాదంగా అందించనున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే భక్తులకు దేవ్రహా బాబా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేశారు.