Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అనాథాశ్రమం ముసుగులో మత మార్పిడి - Vandebharath

  పే ద పిల్లలకు ఆశ్రయం ఇచ్చే పేరుతో అనాథ శరణాలయంలో చేర్చుకుని అనంతరం వారిని మత మార్పిడులకు గురి చేస్తున్న తొమ్మిదిమంది ముఠాను హైదరాబాదు సమ...

 


పేద పిల్లలకు ఆశ్రయం ఇచ్చే పేరుతో అనాథ శరణాలయంలో చేర్చుకుని అనంతరం వారిని మత మార్పిడులకు గురి చేస్తున్న తొమ్మిదిమంది ముఠాను హైదరాబాదు సమీపంలోని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ముఠా సభ్యులు అనాథ శరణాలయం పేరుతో పేద పిల్లలను ముస్లిములుగా మత మార్పిడి చేసేవారు. “పీస్ అర్బన్ హోమ్ సొసైటీ” పేరుతో అనాథ శరణాలయం నడుపుతున్న 9 మంది మత మార్పిడి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేసి చదువు చెప్పిస్తామని నమ్మించి పిల్లలను తమ అనాథ శరణాలయంలో చేర్చుకునేవారు. తర్వాత వారందరినీ మత మార్పిడి చేసేవారు.
విషయాన్ని తెలుసుకున్న జిల్లా బాలల సంక్షేమ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి 4 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల 17 మంది పిల్లలను వారి చెర నుంచి విడిపించారు.

నిందితులలో మహమ్మద్ సిద్ధికీ ఉర్ఫ్ అనే ముఖ్య నిందితుడు ‘సత్యనారాయణ” అనే పేరుతో చలామణి అవుతున్నట్లుగా సమాచారం. అతనితోపాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.