Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మా నానమ్మ ఇందిరా గాంధీ తప్పొప్పుకుంది రాహూల్ - Vandebharath

  దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం  తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.  తన నానమ్మ ఇందిరా గాంధీ కూడా ఇదే అభిప్రాయ...

 


దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం  తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.  తన నానమ్మ ఇందిరా గాంధీ కూడా ఇదే అభిప్రాయం పడిందని రాహుల్ చెప్పారు. ఆర్థికవేత్త కౌశిక్ బసుతో చర్చ సందర్భంగా రాహుల్ ఈ విషయాన్ని అంగీకరించారు.

1975 లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. అది ఖచ్చితంగా చెడు నిర్ణయమే. మా నానమ్మ ఇందిరా గాంధీ కూడా దీన్ని అంగీకరించారు.  అయితే భారత రాజ్యాంగ మూల కేంద్రాన్ని కదిలించడానికి కాంగ్రెస్ ఎన్నడూ ప్రయత్నించ లేదని రాహుల్ అన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి అత్యవసర పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆర్‌ఎస్‌ఎస్. ప్రస్తుతం రాజ్యాంగ సంస్థలన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్ అనే ఒకే ఒక్క సంస్థ మాత్రమేనని రాహుల్ అన్నారు. ప్రజలు లేదా సంస్థల సహకారం లేకుండా అభివృద్ధి కోసం పనిచేయలేమని ఆయన అన్నారు.

రాహూల్ పై విరుచుకుపడ్డ ఆర్ఎస్ఎస్...

రాహుల్ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ తీవ్రంగా స్పందించింది, రాహుల్ వి పరిపక్వత లేని వ్యాఖ్యలుగా కొట్టి వేసింది. ఈ దేశాన్ని దశాబ్దాలుగా పాలించిన గాంధీలు గా చెప్పుకునే కుటుంబం, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని. రాజకీయాలతో సంబందం లేని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థపై అయిన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు.