కాకినాడరూరల్ (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం ఆర్‌టిఒ ఆఫీస్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుం...
కాకినాడరూరల్ (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం ఆర్‌టిఒ ఆఫీస్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. కాకినాడ 9వ వార్డు కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో పాత కక్షలు కారణంగా హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలికి సమీపంలోని సిసిఫుటేజీని పరిశీలిస్తున్నారు. మఅతదేహాన్ని కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.