Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

విడాకులు కోరిన మోడల్‌.. హత్య - Vandebharath

  బీరుట్: విడాకులు కోరిన ఒక మోడల్‌ను ఆమె భర్త హత్య చేశాడు. అనంతరం అతడు టర్కీకి పారిపోయాడు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఈ ఘటన జరిగింది. ఆ దేశా...


 

బీరుట్: విడాకులు కోరిన ఒక మోడల్‌ను ఆమె భర్త హత్య చేశాడు. అనంతరం అతడు టర్కీకి పారిపోయాడు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఈ ఘటన జరిగింది. ఆ దేశానికి చెందిన మోడల్ జీనా కంజో తన అందాలతోపాటు వాణిజ్య ప్రకటనలతో చాలా పాపులర్‌ అయ్యారు. ఈ అందాల రాణికి కొన్ని నెలల కిందట ఇబ్రహీం గజల్‌తో వివాహం అయ్యింది. అయితే భర్త తనను వేధిస్తుంటడంతో ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతడు మారకపోవడంతో విడాకులు తీసుకోవాలని ఆమె నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలో ఆదివారం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన భర్త ఇబ్రహీం భార్య జీనా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడు టర్కీకి పారిపోయాడు. దీనికి ముందు భార్యను హత్య చేసిన విషయాన్ని తన సోదరికి తెలిపాడు. ఈ ఆడియో స్థానిక టీవీ ఛానల్స్‌లో ప్రసారమైంది. 

మరోవైపు నిందితుడ్ని అరెస్ట్‌ చేసేందుకు లెబనాన్‌ పోలీసులు వారెంట్‌ జారీ చేశారు. కాగా, మోడల్‌ జీనా హత్యపై అభిమానులు, నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను హత్య చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో.