ఇంగ్లండ్‌తో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 286 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ముగించిన కోహ్...
ఇంగ్లండ్‌తో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 286 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ముగించిన కోహ్లి సేన, పర్యాటక జట్టు కంటే 481 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలినా అశ్విన్ సెంచరీ(106), కెప్టెన్ కోహ్లి అర్ధసెంచరీ(62)తో 286 పరుగులు చేయగలిగింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత జట్టు.. స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 134 పరుగులకే కట్టడిచేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే 482 పరుగుల లక్ష్య సాధనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. ముచ్చటగా మూడు వికెట్లు తీసి విజయానికి చేరువ చేశారు. 8 ఓవర్లో అక్సర్ పటేల్ బౌలింగ్‌లో ఓపెనర్ సిబ్లీ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. 16 ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో షాట్‌కి యత్నించిన బర్న్స్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లీచ్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఔటయ్యాడు. రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ 50 పరుగులకు మూడు వికెట్లు చేజార్చుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో రూట్ 2, లారెన్స్ 19 పరుగులతో నిలిచారు. అక్షర్ పటేల్ 2, అశ్విన్ 1 వికెట్ సాధించారు. విజయానికి భారత్ 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఇంకా 429 పరుగులు చేయాల్పి ఉంది. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.