Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

టీవీ, ఫ్రిడ్జ్ వున్నాయా? అయితే మీ తెల్ల రేషన్ కార్డు హుళక్కే..! Vandebharath

  మీ ఇంట్లో టెలివిజన్, రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) వున్నాయా? అయితే మీ తెల్ల రేషన్ కార్డు గల్లంతే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుక...


 

మీ ఇంట్లో టెలివిజన్, రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) వున్నాయా? అయితే మీ తెల్ల రేషన్ కార్డు గల్లంతే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిడ్జ్ వుంటే మీరు రేషన్ కార్డు ద్వారా సబ్సిడీపై లభించే రేషన్ వస్తువులకు అర్హులు కాదని తేల్చింది రాష్ట్ర ప్రభుత్వం.

దారిద్య్ర రేఖకు దిగువన నివసించే పేద ప్రజలకు ఇచ్చిన రేషన్‌ కార్డులపై సంచలన నిర్ణయం తీసుకుంది కర్నాటకలోని యడియూరప్ప సర్కార్. టీవీ, ఫ్రిడ్జ్‌, ద్విచక్రవాహనం లాంటివి వున్న వారు తెల్ల రేషన్‌ కార్డును స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆదేశించింది యడ్డీ ప్రభుత్వం. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. టీవీ, ఫ్రిడ్జ్, టూ వీలర్ వున్న వారు ప్రభుత్వం సబ్సిడీ మీద అందించే నిత్యావసర వస్తులకు అర్హులు కాదని కర్నాటక రాష్ట్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ఉమేశ్‌ కత్తి సోమవారం (ఫిబ్రవరి 15న) మీడియా సమావేశంలో వెల్లడించారు.