తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. గతంలో వేల సంఖ్యలో కేసులు నమోదవ్వగా ఇప్పుడు 200 లోపే నమోదవుతున్నాయి. తాజాగా...
తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. గతంలో వేల సంఖ్యలో కేసులు నమోదవ్వగా ఇప్పుడు 200 లోపే నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 161 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,431కి చేరింది. ఇందులో 2,91,846 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1977 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో కొత్తగా కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 1608 మంది మృతి చెందారు.