ఢిల్లీ : చక్కా జామ్‌కు పిలుపునిచ్చారు - Vandebharath
జనవరి 26వ తేదీన డిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఎలాంటి హంసకు దారితీసిందో చెప్పక్కర్లేదు. అయితే, ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు చక్కా జామ్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దేశంలోని జాతీయ రహదారులను దిగ్భంధం చేయబోతున్నారు. అయితే, ఈ చక్కాజామ్ ప్రక్రియ శాంతియుతంగానే జరుగుతుందని రైతుసంఘాలు తెలిపాయి. అయితే, ఆ చక్కాజామ్‌లో అరాచక శక్తులు విద్వంసాలకు పాల్పడే అవకాశం ఉండటంతో, ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో 50వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక, రైతుల చక్కాజామ్‌ను డ్రోన్‌లతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా వెంటనే తిప్పి కొట్టేందుకు వాటర్‌క్యాన్‌లను ఏర్పాటు చేశారు. జనవరి 26న జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని, ఎర్రకోట వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Post A Comment
No comments :