ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ చౌరస్తాలో ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు.. క్యాష్ బాక్సును...
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ చౌరస్తాలో ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు.. క్యాష్ బాక్సును ధ్వంసం చేసి నగదు అపహరించారు. ఏటీఎం మిషన్‌ను సావర్గమ్ ప్రాంతంలో దుండగులు పడేశారు. నిందితులను అంతర్‌రాష్ట్ర దొంగలుగా పోలీసులు గుర్తించారు. నిందితుల ఆచూకీ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ దొంగల ముఠా మొదట.. సోనార్ బజార్ ప్రాంతంలో వైష్ణవి జ్యువెలరీలో చోరీ చేయడానికి యత్నం చేశారని ఆ ప్రయత్నం విఫలమైందని.. అక్కడి నుండి కలెక్టర్ చౌరస్తాలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారని తెలిపారు. తాళ్లతో కట్టి.. టవేరా వాహనంలో ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారని డీఎస్పీ వెల్లడించారు.