Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పీఫైజర్ టీకా భారత్ నుంచి ప్రస్తుతానికి వెనక్కి వెళ్లిపోయిoది - Vandebharath

  అమెరికాలో తయారైన కరోనా టీకా పీఫైజర్ భారత్‌ నుంచి వైదొలిగింది. అంతేకాదు భారత్‌లో అత్యవసర వినియోగం కోసం దాఖలు చేసిన దరఖాస్తును కూడా వెనక్కి ...

 



అమెరికాలో తయారైన కరోనా టీకా పీఫైజర్ భారత్‌ నుంచి వైదొలిగింది. అంతేకాదు భారత్‌లో అత్యవసర వినియోగం కోసం దాఖలు చేసిన దరఖాస్తును కూడా వెనక్కి తీసుకుంది. దీంతో పీఫైజర్ టీకా భారత్ నుంచి ప్రస్తుతానికి వెనక్కి వెళ్లిపోయినట్లైంది. భారత డ్రగ్ రెగ్యులేటరీతో బుధవారం సమావేశం తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఫైజర్ పేర్కొంది. పీఫైజర్ టీకాకు పనితీరుకు సంబంధించి భారత్‌లో మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని, అలాగే దానిని భారత ప్రజలు ఎలా తీసుకుంటున్నారో తెలుసుకోవాలని భారత రెగ్యులేటరీ కోరింది. దీంతో పీఫైజర్ తమ దరఖాస్తును వెనక్కి తీసేసుకుంది. అయితే త్వరలో మిగతా వివరాలను కూడా సేకరించి మళ్లీ దరఖాస్తు చేస్తామని పీఫైజర్ యాజమాన్యం తెలిపింది.