Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఎస్వీబీసీలో నో యాడ్స్ - Vandebharath

  తిరుమల:  శ్రీవారి సేవలన్నీ ఏకాంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన...


 తిరుమల: శ్రీవారి సేవలన్నీ ఏకాంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్వీబీసీలో మార్చి వరకు యాడ్స్ అగ్రిమెంట్ ఉందని, ఏప్రిల్ నుంచి ఎస్వీబీసీలో యాడ్స్‌ ఫ్రీగా చేస్తామన్నారు. తిరుచానూరులో కూడా సేవలు ప్రస్తుతం ఏకాంతంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


రథసప్తమికి ఆన్ లైన్‌లో టికెట్లు విడుదల చేశాం. సర్వ దర్శనం టోకెన్లను రథసప్తమి ముందురోజు కేటాయిస్తాం. వృద్దులు, చిన్న పిల్లల దర్శనాలను కోవిడ్ కారణంగా రద్దు చేశాం. మరో నెలలో వీటిపై నిర్ణయం తీసుకొంటామని’’  ఈవో తెలిపారు. తిరుమలకి ఒక్కరే వచ్చే వృద్ధులకు  ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. టీటీడీలో విధులు నిర్వహించే ఉద్యోగులందరూ తిరునామము ధరించాలని పేర్కొన్నారు. తిరుమలలోని కాటేజీల్లో మరమ్మతులు చేపట్టామని, త్వరలో అద్దె గదుల ధరలు నిర్ణయిస్తామని’’   జవహర్‌రెడ్డి వెల్లడించారు.