కొవిడ్ మహమ్మారి పరిచయమై దాదాపు సంవత్సరం పూర్తవుతున్నా.. మనసుల్లో భయం మాత్రం అలా నిలిచిపోయింది. కొందరు హోం రెమెడీస్ గురించి ఏం తెలిసినా.. న...
కొవిడ్ మహమ్మారి పరిచయమై దాదాపు సంవత్సరం పూర్తవుతున్నా.. మనసుల్లో భయం మాత్రం అలా నిలిచిపోయింది. కొందరు హోం రెమెడీస్ గురించి ఏం తెలిసినా.. నిజమా కాదా అని ఆలోచించకుండానే పాటించేస్తున్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైనప్పటికీ హోం రెమెడీలను పక్కకు పెట్టడం లేదు.
ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ తమకు తెలిసింది.. అనిపించింది షేర్ చేసేస్తున్నారు. అలా ఎవరో పంపిన వాట్సప్ వీడియోను నిజం అనుకుని నమ్మి తల్లీపిల్లలు కలిసి నాలుగురోజులుగా తమ యూరిన్ తామే తాగేస్తున్నారు. తమ బంధువు ఒకరు పంపిన వీడియో చూసి ఇలా చేశామని హెల్త్ వాచ్ సెంట్రల్ వెస్ట్ లండన్ ఇన్వెస్టిగేటర్లకు చెప్తున్నారు.
ప్రతి రోజూ ఉదయం మీ మూత్రం మీరే తాగితే కొవిడ్ 19తో పోరాడొచ్చని ఆ వీడియోలో ఉంది. అంతే ఆమెతో పాటు పిల్లలు కూడా నాలుగు రోజులుగా యూరిన్ తాగేస్తున్నారు. ఇలాంటి ఫేక్ రెమెడీస్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని లండన్ ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
మాకు కరోనా వచ్చిందనే అనుమానం ఉండేది. అందుకే రెమెడీస్, సూచనలు ఎవరు చెప్పినా ఫాలో అయిపోయాం. వాట్సప్ లో వచ్చినదల్లా చేసేవాళ్లం. ఎటువంటి సైంటిఫిక్ డేటా లేకపోయినా.. అలా పాటించేయడం వల్లనే సమస్య వచ్చింది. అని ఆ తల్లి వాపోయింది