బీజేపీలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయా..? జిల్లా ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. జిల...
బీజేపీలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయా..? జిల్లా ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. జిల్లాలో పట్టు సాధించే దిశగా పయ నిస్తున్న బీజేపీలో ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పెరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. పారీ్టలో ఎంతో కీలకమైన జిల్లా పదాధికారుల సమావేశం శనివారం నగరంలోని ఆ పార్టీ కా ర్యాలయంలో జరిగింది. జిల్లా లోని కీలక నేతలు హాజరైన ఈ సమావేశంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు బట్టబయలైనట్లు సమాచారం. ఇటీవల బాన్సువాడలో నిర్వహించిన బహిరంగ సభ నిర్వహణ తీరుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశానికి నిజామాబాద్ నగరానికి చెందిన మహిళా కార్పొరేటర్లు హాజరు కావడంపై ఒకరిద్దరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి దారి తీసినట్లు సమాచారం. ఇతర ప్రధాన పారీ్టలతో పోలి్చతే బీజేపీలో ప్రస్తుతం మహిళా నేతల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి తరుణంలో పారీ్టలో మహిళల ప్రాధాన్యత పెంచాల్సిన నాయకులు.. మహిళా కార్పొరేటర్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై ఎంపీ అరి్వంద్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా నేతల కోసం అర్వింద్ ప్రత్యేకంగా రోప్ పార్టీని ఏర్పాటు చేయించారు. నిరసన కార్యక్రమాల సందర్భంగా మహిళా నేతలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా రక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిస్థితిలో మహిళా నేతల హాజరుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు జిల్లాలో జరిగిన సభ్యత్వ నమోదు ప్రక్రియ విషయంలోనూ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలిసింది. ఆర్మూర్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ మొక్కుబడిగా సాగిందనే అంశంపై చర్చ జరిగింది. ఈ నియోజకవర్గంలో సభ్యత్వ జాబితా తప్పుల తడకగా ఉండటంతో మరో బృందంతో ప్రత్యామ్నాయంగా ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది.