ఇప్పటి వరకూ ఆన్లైన్ మరియు ఆఫీస్ ఎండ్ నుండి సేవలను అందించిన EPFO ఇప్పుడు తన కొత్త సర్వీస్ ను ప్రకటించింది. ఎంప్లాయిస్ తమ అకౌంట్ కి సంబంధించ...
ఇప్పటి వరకూ ఆన్లైన్ మరియు ఆఫీస్ ఎండ్ నుండి సేవలను అందించిన EPFO ఇప్పుడు తన కొత్త సర్వీస్ ను ప్రకటించింది. ఎంప్లాయిస్ తమ అకౌంట్ కి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే దాని కోసం ఆన్లైన్ లేదా ఆఫీస్ వెదుక్కుంటూ వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా కేవలం ఒక చిన్న మెసేజితో ఎంప్లాయిస్ సమస్యల్ని పరిష్కరించేలా చెయ్యడానికి EPFO యొక్క వాట్స్అప్ హెల్ప్ లైన్ సేవలను ప్రకటించింది.
EPFO యొక్క వాట్స్అప్ హెల్ప్ లైన్ సర్వీస్ ద్వారా ఎంప్లాయిస్ ఇంటి నుండే తమ సమస్యలకు పరిష్కారాలను పొందవచ్చని EPFO పేర్కొంది. అంతేకాదు, ఈ EPF వాట్స్అప్ హెల్ప్ లైన్ సర్వీస్ యొక్క దేశంలోని ప్రతి జోన్ లో ఉన్న అన్ని EPF ఆఫీస్ ల వాట్స్అప్ నంబర్లతో వున్న PDF ఫైల్ ను కూడా షేర్ చేసింది. కాబట్టి, ఎంప్లాయిస్ తమ జోన్ మరియు PF నంబర్ యొక్క EPF ఆఫీస్ పరిధి నంబర్ తో తమ సమస్యలకు వివరించి తగిన పరిష్కారాన్ని పొందవచ్చు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన EPF వాట్స్అప్ హెల్ప్ లైన్ నంబర్ లలో సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ (విజయవాడ జోన్)
Guntur - 0863-2344123
Kadapa - 9491138297
Rajamundry - 9494633563
Vishakhapatnam -7382396602
తెలంగాణా (హైదరాబాద్ జోన్)
Hyderabad (Barkatpura) - 9100026170
Hyderabad (Madhapur) - 9100026146
Karimnagar - 9492429685
Kukatpally - 9392369549
Nizamabad - 8919090653
Patancheru - 9494182174
Siddipet - 9603262989
Warangal - 8702447772